iDreamPost
android-app
ios-app

TDP కార్యకర్త వికృత చేష్టలు.. అమ్మాయిలతో అసభ్యంగా..!

TDP కార్యకర్త వికృత చేష్టలు.. అమ్మాయిలతో అసభ్యంగా..!

టీడీపీ కార్యకర్త అరాచకం వెలుగు చూసింది. కాలేజీ అమ్మాయిలని కూడా చూడకుండా వారితో అసభ్యంగా ప్రవర్తించడం, వారిని వేధింపులకు గురి చేయడం చేశాడు. అతని వికృత చేష్టల గురించి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ఎమ్మెల్యేని ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో టీడీపీ కార్యకర్తపై కేసు కూడా నమోదు చేశారు. ఈ ఘటన ఏలూరు జిల్లా మునుగోరు మండలం గోపవరంలో వెలుగు చూసింది.

గోపవరానికి చెందిన 20 మంది విద్యార్థులు శ్రీచైతన్య కళాశాలలో చదువుతున్నారు. వారు రోజూ బస్ లో కాలేజీకి వెళ్లి వస్తూ ఉంటారు. టీడీపీ కార్యకర్త వడ్లమట్ల మురళి(50) గోపవరానికి చెందిన విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. జూన్ 30న బస్సులో ఇంటికి తిరిగి వస్తుండగా మురళి వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విద్యార్థినుల్లో ఒక అమ్మాయి ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలియజేసింది. తర్వాత బస్సుని అడ్డుకుని వడ్లమట్ల మురళిని నిలదీయగా విద్యార్థిని తండ్రిపై అతను దాడికి దిగాడు. విద్యార్థిని తండ్రికి గాయాలు కూడా అయ్యాయి.

దాంతో వారంతా ఈ విషయాన్ని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును ఆశ్రయించారు. వారికి రక్షణ కల్పించాలంటూ వేడుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తక్షణమే మురళిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారు. స్టూడెంట్స్, పేరెంట్స్ ఇచ్చన ఫిర్యాదుతో టీడీపీ కార్యకర్త మురళిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఒక్క కేసు మాత్రమే కాకుండా.. గతంలో కూడా మురళి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అన్ని కేసులను కలిపి కఠినమైన శిక్షలు పడేలా చూస్తామంటూ బాధితులకు పోలీసులు హామీ ఇచ్చారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom