iDreamPost
android-app
ios-app

సైలెంట్ గా వెంకటేష్ 3 సినిమాలు

సైలెంట్ గా వెంకటేష్ 3 సినిమాలు

చిరంజీవి బాలకృష్ణ అంత దూకుడుగా సినిమాలు చేయకపోయినా నటిస్తున్నవి ఖచ్చితంగా హిట్ అవ్వాలనే లక్ష్యంతో ఉన్నారు విక్టరీ వెంకటేష్. కామెడీ మీద ఎన్ని కామెంట్స్ వచ్చినప్పటికీ ఎఫ్3 హిట్ ని ఎవరూ కాదనలేరు. కాకపోతే ఇంకొంచెం కంటెంట్ క్వాలిటీ మీద శ్రద్ధ పెట్టి ఉంటే ఎఫ్2 మించిన రేంజ్ కి చేరుకునేదనే మాటలో నిజం లేకపోలేదు. ప్రస్తుతం ఫుల్ లెన్త్ మూవీ ఏదీ ఒప్పుకోని వెంకీ తన ఖాళీ టైంని స్పెషల్ క్యామియోల కోసం వాడుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే కాంబినేషన్ లో రూపొందుతున్న కిసీకి భాయ్ కిసికీ జాన్ లో హీరోయిన్ అన్నయ్యగా ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దీని కీలక భాగం హైదరాబాద్లో తీశారు.

తాజాగా ఎప్పుడు మొదలయ్యిందో ఎప్పుడు అయిపోతుందో తెలియనంత వేగంగా షూటింగ్ జరుపుకున్న ఓరి దేవుడాలో వెంకీ చేస్తున్న క్యారెక్టర్ ని రివీల్ చేయడంతో ఒక్కసారిగా దాని మీద అంచనాలు మొదలయ్యాయి. తమిళ సూపర్ హిట్ ఓ మై కడవులేకి ఇది అఫీషియల్ రీమేక్. కన్నడలో స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ చేసిన దేవుడి పాత్రనే ఇక్కడ వెంకీ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ లో విజయ్ సేతుపతి కనిపిస్తాడు. మాములుగానే తన ఎనర్జీతో సినిమాకు జోష్ ఇచ్చే వెంకటేష్ గోపాల గోపాలలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి క్యారెక్టర్ తనకే వస్తే ఏ రేంజ్ లో చెలరేగుతాడో వేరే చెప్పాలా. ఆల్రెడీ ప్రోమోలు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పేస్తున్నాయి.

ఓరి దేవుడా అక్టోబర్ 21 దీపావళి పండగ సందర్భంగా విడుదల కానుంది.ఈ లెక్కన వెంకటేష్ సినిమాలు మూడు 2022లోనే వచ్చేసినట్టు అవుతుంది. సల్మాన్ మూవీ డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జనవరిలో షారుఖ్ ఖాన్ పఠాన్ ఉంటుంది కాబట్టి అంతకు ముందు నెలలోనే రావాలనేది కండల వీరుడి ప్లాన్ చిరంజీవి వెంకీలతో మంచి ఫ్రెండ్ షిప్ ఉన్న సల్మాన్ ఆల్రెడీ గాడ్ ఫాదర్ లో భాగమైన సంగతి తెలిసిందే. ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం ఆనారి (చంటి), తక్దీర్ వాలా(యమలీల) రీమేకులతో బాలీవుడ్ కు పరిచయమైన వెంకటేష్ మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత స్ట్రెయిట్ మూవీ చేయడం విశేషం. నెక్స్ట్ చేయబోయే లిస్టులో దర్శకులు అనుదీప్, తరుణ్ భాస్కర్ లు ఉన్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి