iDreamPost
android-app
ios-app

కరాటే కళ్యాణిపై కేసు నమోదు.. మమ్మల్ని కూడా బెదిరించింది అంటూ బయటికొచ్చిన మరో బాధితుడు..

  • Published May 14, 2022 | 7:10 PM Updated Updated May 14, 2022 | 7:10 PM
  • Published May 14, 2022 | 7:10 PMUpdated May 14, 2022 | 7:10 PM
కరాటే కళ్యాణిపై కేసు నమోదు.. మమ్మల్ని కూడా బెదిరించింది అంటూ బయటికొచ్చిన మరో బాధితుడు..

ప్రాంక్ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని అర్ధరాత్రి నడి రోడ్డుపై కొట్టి సంచలనం సృష్టించింది నటి కరాటే కళ్యాణి. ఆ తర్వాత వాళ్లిద్దరూ రోడ్డు మీద వాదులాడుకోవడం, ఒకరిపై ఒకరు పోలీసులకి ఫిర్యాదు చేయడం చేశారు. ప్రాంక్ ల పేరుతో శ్రీకాంత్ అమ్మాయిలని అవమానపరుస్తున్నాడని కళ్యాణి, నేనేం తప్పు చేయలేదు ఆమె డబ్బులు ఇవ్వమని బెదిరిస్తుందని శ్రీకాంత్ ఒకరి మీద ఒకరు పరస్పర ఆరోపణలు చేశారు.

వీరిద్దరూ నిన్న SRనగర్ పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఇవ్వగా ఇద్దరి మీద కేసు నమోదు చేశారు పోలీసులు. కరాటే కళ్యాణి యూట్యూబర్ శ్రీకాంత్ పై ఇచిన ఫిర్యాదు మేరకు శ్రీకాంత్ రెడ్డిపై IPC సెక్షన్ 323, 506, 509 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి కరాటే కళ్యాణిపై చేసిన ఫిర్యాదు మేరకు IPC 323, 448, 506 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతామని పోలీసులు వెల్లడించారు.

తాజాగా నటి కరాటే కళ్యాణిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ట్విట్టర్ ద్వారా ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. గోపీకృష్ణ అనే వ్యక్తి కరాటే కళ్యాణి బాధితుల్లో మేము కూడా ఒకరమే, ఆమె మా నుండి ఓ ఇంటి వ్యవహారంలో 3.5 లక్షలు వసూలు చేసింది. ఒక ఇల్లు కొనుగోలు విషయంలో కళ్యాణి మాతో ఒప్పందం చేసుకుంది. SBI లో ఆమె ఋణం తిరస్కరించబడితే అది మమ్మల్ని కట్టాలని లేకపోతే పురుగుల ముందు తాగి చనిపోతానని బెదిరించింది అని తెలిపాడు. ఆమె వల్ల మేము కూడా నష్టపోయాం, మాకు మాకు తగిన న్యాయం చేయాలని కోరాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet