iDreamPost
android-app
ios-app

Pakistan: పాకిస్తాన్‌లో ఏకైక హిందూ సంస్థానం.. ఈ రాజుని చూస్తే ప్రభుత్వమే వణికిపోతుంది!

  • Published Jan 05, 2024 | 4:47 PM Updated Updated Jan 05, 2024 | 5:56 PM

భారత దేశంలో హిందూ సంప్రదాయానికి .. హిందూ సంస్థానాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. కానీ, వేరే ఇతర దేశాలలో హిందూ సంస్థానాలకు అంతగా ప్రాధాన్యతను ఇవ్వరు. ముఖ్యంగా పాకిస్థాన్ లో హిందూ సంస్థానాలకు అసలు ప్రాధాన్యత ఉండదు. అలాంటిది ఇప్పటికీ పాకిస్తాన్ లో ఒకే ఒక్క హిందూ సంస్థానానికి ప్రాధాన్యత ఇస్తున్నారట.

భారత దేశంలో హిందూ సంప్రదాయానికి .. హిందూ సంస్థానాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. కానీ, వేరే ఇతర దేశాలలో హిందూ సంస్థానాలకు అంతగా ప్రాధాన్యతను ఇవ్వరు. ముఖ్యంగా పాకిస్థాన్ లో హిందూ సంస్థానాలకు అసలు ప్రాధాన్యత ఉండదు. అలాంటిది ఇప్పటికీ పాకిస్తాన్ లో ఒకే ఒక్క హిందూ సంస్థానానికి ప్రాధాన్యత ఇస్తున్నారట.

  • Published Jan 05, 2024 | 4:47 PMUpdated Jan 05, 2024 | 5:56 PM
Pakistan: పాకిస్తాన్‌లో ఏకైక హిందూ సంస్థానం.. ఈ రాజుని చూస్తే ప్రభుత్వమే వణికిపోతుంది!

భారతదేశం పాకిస్తాన్ నుంచి వేరైన తర్వాత హిందూ మతానికి సంబంధించిన.. చాలా వరకు సంస్థానాలు ఇండియాకు వచ్చేశాయి. కానీ, కొన్ని సంస్థానాలు మాత్రం పాక్ లోనే ఉండిపోయాయి. అలా ఉండిపోయిన సంస్థానాలు హిందూ మతానికి సంబంధించిన కారణంగా.. కాల క్రమేణ కనుమరుగైపోయాయి. పైగా పాకిస్తాన్ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ నివసిస్తున్న కొంతమంది హిందువులను కూడా బలవంతంగా మత మార్పిడి చేస్తూ ఉంటారు. అలాంటి నియమాలను పాటిస్తున్న పాకిస్తాన్ లో .. ఇప్పటికీ ఓ హిందూ సంస్థానానికి .. పూర్వం ఏదైతే గౌరావాన్ని ఇచ్చేవారో.. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే గౌరావాన్ని ఇస్తున్నారట. పైగా, ఈ సంస్థానపు రాజకుటుంబం అంటే పాకిస్తాన్ ప్రభుత్వం భయపడుతుందట.

మరి, పాకిస్తాన్ లో ఇప్పటికీ ప్రాధాన్యత ఇస్తున్న ఆ హిందూ సంస్థానం గురించి.. కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఆ హిందూ సంస్థానాన్ని ఉమర్ కోట్ గా పిలుస్తున్నారు. ఇది పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో ఉంది. ఒకప్పడు దీనిని అమర్ కోట్ అనేవారు. దీనిని హమీర్ సింగ్ సోధా అనే రాజు పాలించేవాడు. అయితే, పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడిన సమయానికి ఈ అమర్ కోట్ సంస్థానం చాలా పెద్దగా ఉండేది. ఇప్పటికీ ఈ సంస్థానం సోధా కుటుంబం ఆధీనంలోనే ఉంది. ప్రస్తుతం హమీర్ సింగ్ సోధా కుమారుడు కర్ణి సింగ్ ఈ సంస్థానాన్ని పరిపాలిస్తున్నాడు. అయితే, మొదటి నుంచి ఈ కుటుంబానికి రాజకీయంగానూ.. పలుకుబడిలోనూ అపార శక్తి సామర్థ్యాలు, ప్రత్యేక స్థానం ఉన్నాయి. తర తరాల నుంచి వీరి వారసత్వం కొనసాగుతూనే ఉంది.

Indian King in Paklisthan

హమీర్ సింగ్ కంటే ముందు అతని తండ్రి రాణా చంద్ర సింగ్ ఈ అమర్ కోట్ ను పాలించేవారు. ఆ సమయంలో ఈయన హిందువుల కోసం ప్రత్యేక పార్టీని స్థాపించారు. ఈ పార్టీ జెండా కాషాయ రంగులో ఉండి.. దానిపై ఓం, త్రిశూలం చిత్రాలు కూడా ఉంటాయి. పైగా పాకిస్థాన్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోకు రాణా చంద్ర సింగ్ చాలా సన్నిహితుడు. అంతే కాకుండా చంద్రసింగ్ ఏడు సార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. కాగా, 2009 లో ఈయన కన్ను మూశారు. ఇప్పటికి పాక్ ఎన్నికలలో ఈ పార్టీ పోటీగా నిలుస్తుంది అంటే.. అది ఖచ్చితంగా సోధా కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతల వలన మాత్రమే సాధ్యం.

Indian King in Paklisthan

కాగా థార్ పకర్, ఉమర్ కోట్, మిథి ప్రాంతాలకు చెందిన హిందువులు, ముస్లింలు.. ఇప్పటికీ కూడా సోధా కుటుంబాన్నే వారి పాలకుడిగా భావిస్తారు. ఇక్కడ కొత్త రాజుకు అభిషేకం జరపడాన్ని ఓ పెద్ద వేడుకగా భావిస్తారు. పైగా, అక్కడి ప్రజలు వారి సమస్యలనుపరిష్కరించుకోడానికి స్థానిక పాలకుల వద్దకు వెళ్లకుండా.. ఈ రాజ కుటుంబం వద్దకు వస్తారట. ఇక ప్రస్తుతం అమర్ కోట్ సంస్థానానికి రాజుగా ఉన్న కర్ణి సింగ్.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. ఈయనకు సెక్యూరిటీగా భారీ సంఖ్యలో బాడీగార్డులు ఉంటారు. ఈయన ఎక్కడకు వెళ్లినా భద్రతా ఏర్పాట్లు కట్టు దిట్టంగా చేస్తారు. ఇంకా ఈ రాజు వివాహ సమయంలో వీరి ఊరేగింపు పాక్ లోని అమర్ కోట్ నుంచి ఇండియా వరకు జరిగింది. అయితే, ఇక్కడ మహిళలకు మాత్రం కఠినమైన నియమాలు ఉంటాయట. వారు ఇళ్ల నుంచి బయటకు రావడం, పర పురుషుడిని చూడడం ఇలాంటివి చేయకూడదట. ఈ ఒక్క విషయంలో మాత్రం ఈ సంస్థానానికి విమర్శలు వస్తూ ఉంటాయి. మరి, పాకిస్తాన్ లో ప్రత్యేకంగా నిలిచిన ఉమర్ కోట్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.