iDreamPost
android-app
ios-app

Omicron : దేశంలో ‘Omicron’ కలకలం..5 కి చేరిన కేసులు

  • Published Dec 05, 2021 | 7:58 AM Updated Updated Dec 05, 2021 | 7:58 AM
Omicron : దేశంలో ‘Omicron’ కలకలం..5 కి చేరిన కేసులు

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ వేరియంట్‌తో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కాగా..ఆదివారం మరోక పాజిటివ్ కేసు రికార్డుల్లో చేరింది. ఆదివారం ఉదయం ఢిల్లీలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. టాంజానియా నుంచి వచ్చిన ఓ వ్యక్తి నమూనాలు పరిశీలించగా పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు ధ్రువీకరించారు.

దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే ఇప్పటికే కర్నాటకలో రెండు, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

కేంద్రం ప్రకారం, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్‌వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్ మరియు ఇజ్రాయెల్‌తో సహా యూరోపియన్ దేశాలు చాలా ప్రమాదంలో ఉన్నట్టుగా గుర్తించబడ్డాయి. మన దేశంలో ఒక్కొక్క కేసు చాపకింద నీరులా వ్యాపిస్తుండడంతో ప్రజల్లో మళ్ళీ కరోనా భయం మొదలయ్యింది. వివిధ రాష్ట్రాల్లోని అధికారులు కూడా అప్రమత్తమై తగిన చర్యలకు సిద్ధమవుతున్నారు.

Also Read : AIIMS, Telemedicine – ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. ఇంటి నుంచే ఎయిమ్స్‌ వైద్య సేవలు