iDreamPost
android-app
ios-app

బుల్లితెర నటి రష్మీ ఆత్మహత్య.. లవ్ ఫెయిల్యూరే కారణమా ?

  • Published Jun 21, 2022 | 10:34 AM Updated Updated Jun 21, 2022 | 11:46 AM
  • Published Jun 21, 2022 | 10:34 AMUpdated Jun 21, 2022 | 11:46 AM
బుల్లితెర నటి రష్మీ ఆత్మహత్య.. లవ్ ఫెయిల్యూరే కారణమా ?

సినీ పరిశ్రమలో మరో విషాదం జరిగింది. ప్రముఖ ఒడియా బుల్లితెర నటి రష్మీరేఖ ఓజా(23) బలవన్మరణానికి పాల్పడింది. భువనేశ్వర్ లోని గదసాహీ ప్రాంతానికి సమీపంలోని నాయపల్లిలో అద్దె ఇంటిలో రష్మీ ఉరివేసుకుని మృతిచెందింది. కొద్దిరోజులుగా రష్మీ అదే ఇంటిలో అద్దెకు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇంటి యజమాని సమాచారంతో పోలీసులు ఆ ఇంటికెళ్లి రష్మీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఇంటిలో సూసైడ్ నోట్ లభ్యమవ్వగా.. అందులో తన మరణానికి కారణం కాదని తెలిపింది. ‘ఐ లవ్‌ యూ సాన్’ అని రాసుకొచ్చింది.

రష్మీ కొన్నాళ్లుగా సంతోష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె మరణానికి అతనే కారణమై ఉండవచ్చని రష్మీ తండ్రి ఆరోపిస్తున్నారు. జూన్ 18వ తేదీ శనివారం రష్మీకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత రష్మీ చనిపోయినట్లు సంతోష్ మాకు చెప్పాడు. సంతోష్, రష్మీ భార్యభర్తలుగా ఉంటున్నట్లు ఇంటి యజమాని చెప్పేంతవరకూ.. వారిద్దరి గురించి తమకు తెలియదని రష్మీరేఖ తండ్రి పోలీసులకు తెలిపారు. కాగా.. జగత్ సింగ్ పూర్ జిల్లాకు చెందిన రష్మీ ‘కెమిటి కహిబి కహా’ అనే ఒడియా సీరియల్ తో గుర్తింపు పొందింది.

 

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş