iDreamPost
android-app
ios-app

తెలుగు విక్రమ్ లో మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్.. అదిరిపోయిన ట్రైలర్..

  • Published Jun 20, 2022 | 8:45 PM Updated Updated Jun 20, 2022 | 8:45 PM
  • Published Jun 20, 2022 | 8:45 PMUpdated Jun 20, 2022 | 8:45 PM
తెలుగు విక్రమ్ లో మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్.. అదిరిపోయిన ట్రైలర్..

కమల్‌హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్ ఫాజిల్‌ ముఖ్యపాత్రల్లో సూర్య గెస్ట్‌ రోల్‌లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా విక్రమ్. ఈ సినిమా భారీ విజయం సాధించింది. తెలుగు, తమిళ్ లో అయితే కనకవర్షం కురుస్తుంది. ఇప్పటికే విక్రమ్ సినిమాకి దాదాపు 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా భారీ విజయంపై కమల్ హాసన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. టీం అందరికి గిఫ్ట్స్, పార్టీలు ఇస్తున్నారు. తెలుగులో కూడా ఈ సినిమా భారీ విజయం సాధించింది.

ఈ భారీ మల్టీస్టారర్ సినిమాని తెలుగు స్టార్ హీరోలు చేస్తే ఎలా ఉంటుంది అని అంతా భావిస్తున్నారు. అయితే కొంతమంది ఓ అడుగు ముందుకేసి ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు కలిసి విక్రమ్ సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందో చూపించేసారు. సరిలేరు నీకెవ్వరూ, సాహో, అరవింద సమేత సినిమాలలోని కొన్ని సీన్స్ ని తీసుకొని విక్రమ్ సినిమా ట్రైలర్ వాయిస్ కి తగ్గట్టు ఎడిటింగ్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఫ్యాన్స్ ఎడిట్ చేసిన ఈ తెలుగు విక్రమ్ ట్రైలర్ లో ముగ్గురు హీరోలు చేసే భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఈ ఫ్యాన్ ఎడిట్ ట్రైలర్ చూసిన ఆ హీరోల అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా అదిరిపోయింది అని అంటున్నారు. నిజంగానే వీరు ముగ్గురు కలిసి ఓ యాక్షన్ సినిమా చేస్తే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే అంటున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet