P Krishna
NSG and Octopus Teams: తిరుమల పుణ్యక్షేత్రానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని పునీతులవుతారు. భక్తుల రక్షణ కోసం తిరుమలలో టీటీడీ గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది.
NSG and Octopus Teams: తిరుమల పుణ్యక్షేత్రానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని పునీతులవుతారు. భక్తుల రక్షణ కోసం తిరుమలలో టీటీడీ గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది.
P Krishna
ప్రపంచ ప్రఖ్యాత హైందవ పుణ్య క్షేత్రంగా ప్రసిద్ది గాంచింది తిరుమల తిరుపతి. కలియుగ వైకుంఠ దివ్య క్షేత్రంగా యుగ యుగాల నుంచి భాసిల్లుతున్న పుణ్య క్షేత్రం తిరుమల. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు. అందుకే తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణం. నిత్యం ఇక్కడికి వేలాది భక్తులు స్వామి వారి దర్శనం కోసం వస్తుంటారు. మొక్కులు చెల్లించుకుంటారు. అనంత పేర్లు కలిగిన స్వామి ఏ పేరుతో భక్తుడు పిలిచినా పలికే.. కోనేటి రాయుడి దర్శనార్ధం దేశం నలుమూలల నుంచే కాదు.. విదేశాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తుంటారు. సామాన్యుల నుంచి సంపన్నులు, పొలిటీషియన్స్, సెలబ్రెటీలతో ప్రతిరోజూ హడావుడిగా ఉంటుంది. వీరి భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. తిరుమల ఆలయం వద్ద ఎన్ఎస్జీ, ఆక్టోపస్ టీమ్ సందడి చేశారు. వివరాల్లోకి వెళితే..
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులతో పాటు వీఐపీలు, వీవీఐపీలు సైతం వస్తుంటారు. వీరికి భద్రత కల్పించడం కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయం శత్రుదుర్భేద్యంగా మారింది. నిన్న తిరుమల ఆలయం వద్ద ఎన్ఎస్జీ, ఆక్టోపస్ టీమ్‌లు సందడి చేశాయి. ఆలయం వద్ద ఎన్ఎస్జీ, ఆక్టోపస్ టీమ్ ఒక్కసారిగా ఉరుకులు పరుగులు పెట్టడంతో భక్తులు టెన్షన్ పడ్డారు. అసలు ఏం జరుగుతుందని కొద్దిసేపు కంగారు పడ్డారు. అసలు విషయం చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. తిరుమల ఆలయంలో ఎన్‌ఎస్‌జీ, ఆక్టోపస్ టీమ్‌లు మాక్క డ్రిల్ నిర్వహించారు. 140 మంది ఎన్‌ఎస్‌జీ,40 మంది ఏపీ ఆక్టోపస్ టీమ్ తో పాటు టీటీడీ విజిలెన్స్, ఏపీ పోలీసులు కూడా మాక్ డ్రిల్ లో పాల్గొన్నారు. అయితే ఇదంతా స్వామి ఆలయంలో ఏకాంత సేవ పూర్తి అయిన తర్వాత భక్తులు లేని సమయంలో నిర్వహించారు.
ఇటీవల దేశంలో ఉగ్రవాదుల దాడులు పెరిగిపోతున్నాయి. ఈ మధ్యనే బెంగుళూరు రామేశ్వరం కేఫ్ లో పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. సంఘ విద్రోహులు తిరుమలలో ఏదైనా ప్రదేశం పై దాడి చేసినపుడు టీటీడీ భద్రతా దళాలు సాధ్యమైనంత త్వరగా వారిపై ఎదురుదాడి చేసి. వారి చెరలోల ఉన్న బంధీలను సురక్షితంగా విడిపించి, భక్తులుకు ఎలాంటి అపాయం జరగకుండా ,టీటీడీ ఆస్తులకు ఎలాంటి నష్టం జరగనీయకుండా కాపాడటం ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశ్యం. తిరుమల ఆలయం వద్ద ప్రతి ఏడాది ఇటువంటి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉంటారు. అయితే మాక్ డ్రిల్ సమయంలో ఆలయం వద్దకు మీడియాను అనుమతించలేదు.