iDreamPost

మార్కెట్ లోకి నోకియా 8210 4G , ధ‌ర‌ రూ. 3,999. వివరాలు క‌థ‌నంలో..

మార్కెట్ లోకి నోకియా 8210 4G , ధ‌ర‌ రూ. 3,999. వివరాలు క‌థ‌నంలో..

నోకియా భారతదేశంలో కొత్త ఫీచర్ ఫోన్ Nokia 8210 4Gని విడుదల చేసింది. ఇది Unisoc SoC ప్రొసెస‌ర్ మీద ప‌నిచేస్తుంది. ఫోన్ మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంది. కాబ‌ట్టి స్టోరేజీని పెంచుకోవ‌చ్చు. బ్యాట‌రీని బైట‌కు తీయొచ్చు. వెనుక ప్యానెల్‌లో ఒక చిన్న‌ కెమెరా ఉంది. కంపెనీ ప్ర‌కారం దాదాపు ఒక నెల స్టాండ్‌బై టైం ఉంటుంది.

Nokia 8210 4G ధర , ఫీచ‌ర్స్

సింగిల్ స్టోరేజ్ వేరియంట్‌లో ఫోన్ మార్కెట్ లోకి Nokia 8210 4G వ‌చ్చింది. ఎరుపు , ముదురు నీలం, రెండుక‌ల‌ర్స్ మాత్ర‌మే దొరుకుతుంది. ధర రూ.3,999. ఈ ఫోన్ ని అమెజాన్ లో బుక్ చేసుకోవ‌చ్చు. నోకియా ఇండియా అధికారిక స్టోర్‌లో అందుబాటులో ఉంది.

Nokia 8210 4G ఫోన్ చూడ‌టానికి చిన్న‌దేకాని, డ్యూయల్-సిమ్ స్లాట్ లున్నాయి. చాలామంది కోరుకొనే ఫీచ‌ర్ ఇది. నోకియా 8210 4G ని Unisoc T107 SoC ప్రొసెస‌ర్ న‌డిపిస్తుంది. ఇందులో 48 MB RAM, 128 MB స్టోరేజ్ ఉంది. 6-8 జీబీల ర్యామ్ ను వాడే ఈ త‌రానికి MBల్లో ర్యామ్ అంటే న‌వ్వొస్తుందికాని, ఈ ఫోన్ ఈ ర్యామ్ స‌రిపోతుంది. స్టోరేజీని 32GB వరకు పెంచుకోవ‌చ్చు.

Nokia 8210 4G 3.8-అంగుళాల QVGA డిస్‌ప్లేతో వ‌చ్చింది. వెనుక ప్యానెల్‌లోని కెమెరా 0.3-మెగాపిక్సెల్ తో ఫోటోలు తీస్తుంది. FM వినొచ్చు. mp3 మీడియా ప్లేయర్‌కు వాడొచ్చు. కొత్త ఫీచర్ ఫోన్‌లో 3.5mm ఆడియో జాక్ కూడా ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీని కూడా ఉంది.

నోకియా 8210 4G బ‌లమంతా బ్యాట‌రీయే. 1,450 mAh బ్యాటరీ యూనిట్‌తో 27 రోజుల వరకు బ్యాటరీ స్టాండ్‌బై టైం ఉంది. మీరు కాల్స్ తో ఎంత‌వాడినా క‌నీసం నాలుగైదురోజుల వ‌ర‌కు ఛార్జీంగ్ చూసుకోన‌క్క‌ర్లేదు. దీన్ని మైక్రో USB పోర్ట్ ద్వారా ఛార్జింగ్ చేసుకోవాలి.

ఒక్క‌మాట‌లో Nokia 8210 4G అంటే MP3 player, FM radioతో వ‌చ్చిన క్లాసిక‌ల్ ఫీచ‌ర్స్ ఫోన్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి