Idream media
Idream media
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రామస్వామి అప్పుడే బయట నుంచి ఇంట్లోకి వచ్చి టీవీ ఆన్ చేశాడు. అదే సమయంలో తెలుగుదేశం పాార్టీ అధినేత చంద్రబాబు ఎక్కి ఎక్కి ఏడుస్తూ కనిపించారు. టీడీపీ అంటే ఇష్టం లేని వ్యక్తి అయినప్పటికీ అంత పెద్దాయన అలా ఏడుస్తుంటే అయ్యో పాపం అనుకున్నాడు. చంద్రబాబు మాటలు విని.. శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు బాబు భార్యను అనరాని మాటలు అన్నట్లు ఉన్నారు అని ఊహించాడు. అసలేం ఏమన్నారో విందామని ఫోన్ లోని యూ ట్యూబ్ లో తెగ ప్రయత్నించాడు.
దాదాపు రెండు గంటల పాటు అదే పనిలో ఉన్నాడు. కానీ.. ఎక్కడా బాబు కుటుంబ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యల వీడియో కనిపించ లేదు. ఇంతలో ఫోన్ చేసిన స్నేహితుడిని ఈరోజు శాసనసభ సమావేశాలు చూశావా.. ఎన్టీఆర్ కుమార్తె గురించి వైసీపీ ఎమ్మెల్యేలు ఏమన్నారు అని అడిగాడు. చూశాను కానీ.. నాకు కూడా ఏమన్నారో తెలియలేదని సమాధానం చెబితే.. రామస్వామి తలపట్టుకున్నాడు.
రామ స్వామి ఒక్కడే కాదు.. నిన్న చంద్రబాబు యాక్షన్ ను చూసి చాలా మందిది ఇదే పరిస్థితి. నా భార్యపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు పేర్కొన్నప్పటికీ అటువంటి వీడియోలు ఏవీ బయటకు రాకపోవడంతో.. అసలు చంద్రబాబుది నిజమైన బాధేనా? లేక సొంత నియోజకవర్గం కుప్పం లో మున్సిపాల్టీ ఎన్నికలలో ఓడిపోవడంతో ఫ్రస్టేషన్ కు గురయ్యారా అనే చర్చలు మొదలయ్యాయి. తనను ఎన్ని అన్నా.. సహించానని.. రాజకీయాల కోసం.. ప్రజలకోసం.. తను రెండున్నరేళ్లుగా మాటలు పడ్డానని.. చంద్రబాబు వ్యాఖ్యానించడం, సభలో తీవ్రమైన శపథాల వెనుక కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు.
అయితే.. ఇక్కడే గత చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఒక విషయం చర్చకు వస్తోంది. అప్పట్లో విపక్షంలో ఉన్న వైసీపీ నుంచి చంద్రబాబు.. 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. పార్టీ కండువాలు కప్పారు. మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అంతేకాదు.. జగన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఇదంతా కూడా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది. దీంతో ఈ తిట్లు భరించలేక.. జగన్ అప్పట్లో అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన ప్రజల దగ్గరకే వెల్లి.. ముఖ్యమంత్రి అయిన తర్వాత.. వస్తానని శపథం చేశారు. ఈ క్రమంలోనే ఆయన ప్రజా సంకల్పయాత్ర చేశారు.
సుదీర్ఘ లక్ష్యం పెట్టుకుని అసెంబ్లీలో కాలు పెట్టకుండా.. పాదయాత్ర చేశారు. ఈ క్రమంలోనే ఆయన 2019 ఎన్నికల్లో ప్రజల దీవెనలతో భారీ విజయం దక్కించుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎవరూ సాధించని మెజారిటీ దక్కించుకుని 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే శపథం చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాతే.. అసెంబ్లీలోకి వస్తానని.. ఆయన శపథం చేశారు. అయితే.. ఇప్పుడు చంద్రబాబుకు, జగన్ కు భారీ తేడా ఉంది. అప్పుడు జగన్ పై జరిగిన దాడి ఘటనలు తాలూకు దృశ్యాలు ఉన్నాయి. కానీ చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగా వీడియోలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బాబు కన్నీళ్లను ప్రజలు ఎంత వరకు నమ్ముతారో వేచి చూడాలి.