iDreamPost
iDreamPost
ఈ సంక్రాంతికి మొత్తం నాలుగు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు వస్తున్నాయి. ఉన్న ఒక్క డబ్బింగ్ నా పేరు శివ 2 ఆల్రెడీ తప్పుకోవడంతో గ్రౌండ్ ఇంకాస్త ఫ్రీ అయ్యింది. అయితే వీటిలో ఒక సారూప్యత ఎన్నడూ లేనంత వెరైటీగా కనిపిస్తోంది. అదే వారసత్వం. బంగార్రాజులో పేరుకు నాగార్జున హీరోగా కనిపిస్తున్నా నిజానికి టైటిల్ రోల్ నాగ చైతన్యది. మాస్ లో తను ఈసారి బలంగా ఎస్టాబ్లిష్ అవుతాడన్న నమ్మకం అన్నపూర్ణ టీమ్ లో ఉంది. దానికి తగ్గట్టే టీజర్ ట్రైలర్ చైతు మీదే ఫోకస్ పెట్టాయి. ఇక రౌడీ బాయ్స్ డెబ్యూ చేస్తున్న ఆశిష్ దిల్ రాజు సోదరుడు శిరీష్ కొడుకన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ అల్లు అర్జున్ లు చెరో పాట, తారక్ ట్రైలర్ రిలీజ్ చేసి పెట్టారు.
ఇవాళ రామ్ చరణ్ అతిధిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. బుకింగ్స్ చాలా స్లోగా ఉన్నాయి కానీ యూత్ ని నమ్ముకుని వస్తున్న ఈ సినిమా మీద దిల్ రాజు భారీ బడ్జెట్ ఖర్చు పెట్టారు. ఇన్ని సినిమాలు తీసిన తమ సంస్థ నుంచి ఒక స్వంత హీరోని దింపుతున్న రాజు గారు ప్రోడక్ట్ విషయంలో గట్టి జాగ్రత్తలే తీసుకున్నారు. గల్లా అశోక్ హీరో కూడా ఆసక్తికరంగానే కనిపిస్తోంది. తండ్రి గల్లా జయదేవ్ ది రాజకీయ నేపధ్యమే అయినా మహేష్ బాబు ఫ్యామిలీ హీరోగానే అశోక్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఘట్టమనేని అభిమానుల మద్దతు సోషల్ మీడియాలో కనిపిస్తోంది. కంటెంట్ బాగుంటే కనక మొదటి వారం కాకపోయినా తర్వాత పికప్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు.
ఇక సూపర్ మచ్చి గురించి ఎవరూ మాట్లాడ్డం లేదు కానీ చిరంజీవి చిన్నల్లుడిగా ప్రయత్నాలు చేస్తూ హీరోగా ఇండస్ట్రీలో సెటిలవ్వాలని ట్రై చేస్తున్న కళ్యాణ్ దేవ్ కు దీని మీద ఎంత నమ్మకం ఉందో కానీ ప్రమోషన్లు మాత్రం పెద్దగా జరగడం లేదు. ఫలితం ఎల్లుండి తేలిపోతుంది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాలి. మొత్తానికి నాలుగు బలమైన నేపధ్యాలు కలిగిన నలుగురు హీరోల సినిమాలు ఈసారి బాక్సాఫీస్ వద్ద తలపడుతున్నాయి. సంక్రాంతికి ఒక్క వంద కోట్ల సినిమా లేకపోవడం గత కొన్నేళ్లలో ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. బంగార్రాజు సైతం 40 కోట్ల టార్గెట్ తో బిజినెస్ చేసుకుంది. ఇక మిగిలినవన్నీ పదిహేను లోపే
Also Read : Super Machi : మెగాల్లుడి సినిమా ఇంత సైలెంట్ గానా