సినిమా హాళ్ళు ఎప్పుడు తెరచుకుంటాయో తెలియని పరిస్థితుల్లో మెయిన్ స్ట్రీమ్ సినిమాల నుంచి ఇటు దర్శకులు, అటు నటీనటులు.. ఇతరత్రా ఆప్షన్స్ వైపు మొగ్గు చూపుతున్న విషయం విదితమే. దర్శకుడు చందూ మొండేటి కూడా ఈ బాటలోనే పయనిస్తున్నాడట. స్టన్నింగ్ బ్యూటీ నివేదా పేతురాజ్‌తో చందూ మొండేటి హాట్ అండ్ స్పైసీ థ్రిల్లర్ ఒకటి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ థ్రిల్లర్ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమయ్యిందట. దీన్ని ఓటీటీ రిలీజ్ ఆలోచనలతో తెరకెక్కిస్తున్నారని సమాచారం. నిజానికి చందూ మొండేటి, ‘కార్తికేయ2’ సినిమాని హీరో నిఖిల్ సిద్దార్ధతో తెరకెక్కించాల్సి వుంది. అయితే, కోవిడ్ పరిస్థితుల్లో వచ్చిన గ్యాప్ కారణంగా, ఈ ఓటీటీ థ్రిల్లర్‌ని డిజైన్ చేసుకున్నాడట. దానికి స్టార్‌డమ్ అద్దితే, అదిరిపోతుందన్న కోణంలో నివేదా పేతురాజ్‌ని ఎంపిక చేశాడని అంటున్నారు. సినిమాలో కావాల్సినంత ఫన్, అంతకు మించి హాట్ కంటెంట్, వీటన్నిటినీ మించేలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వుండబోతున్నాయట. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో కొంచెం హాట్‌గా చాలా చిన్న పాత్రలో కనిపించిన నివేదా పేతురాజ్ చేతిలో ప్రస్తుతం పలు సినిమాలున్నాయి. అందులో సాయిధరవ్‌ు తేజ్ సరసన చేస్తోన్న సినిమా కూడా ఒకటి. ‘రెడ్’ సినిమాలోనూ నివేదా పేతురాజ్ నటిస్తోన్న విషయం విదితమే. ఇదిలా వుంటే, చందూ మొండేటి తెరకెక్కించనున్న సినిమాలో కథంతా నివేదా పాత్ర చుట్టూనే తిరుగుతుందనీ, ఓ ప్రముఖ నటుడు ఇందులో గెస్ట్ రోల్‌లో కనిపించే అవకాశం వుందనీ తెలుస్తోంది.