iDreamPost
android-app
ios-app

‘నిశ్శబ్దం’గా వాయిదా పడుతోందా

  • Published Jan 24, 2020 | 10:35 AM Updated Updated Jan 24, 2020 | 10:35 AM
  • Published Jan 24, 2020 | 10:35 AMUpdated Jan 24, 2020 | 10:35 AM
‘నిశ్శబ్దం’గా వాయిదా పడుతోందా

భాగమతి తర్వాత అనుష్క నటించిన సినిమా ఒక్కటీ విడుదల కాలేదు. అభిమానూలు ఎంత కోరుకున్నా నిరీక్షణ మాత్రం తీరడం లేదు. సరే ఆలస్యం అయితే అయ్యింది రెండేళ్ల తర్వాత స్వీటీని చూస్తాం కదా అన్న ఎదురుచూపులు ఇంకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు నిశ్శబ్దం ఫిబ్రవరి 20కు వాయిదా పడినట్టుగా తెలిసింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ముందు అనుకున్న డిస్కోరాజాతో పాటు నిశ్శబ్దం ఇవాళే విడుదల అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ అనుకున్న టైంకి పూర్తి కాకపోవడం బిజినెస్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురుకావడం లాంటి కారణాల వల్ల కాపీ సిద్ధమైనా రిలీజ్ చేసే నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్టు తెలిసింది.

క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన నిశ్శబ్దంలో అనుష్క పెయింటింగ్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. మాధవన్ చాలా కీలక పాత్ర చేస్తున్నాడు. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, మైకెల్ మ్యాడ్ సన్ తదితరులు ఇతర తారాగణం.

టీజర్ విడుదలై చాలా రోజులైనప్పటికీ తర్వాత ప్రమోషన్ విషయంలో యూనిట్ సైలెంట్ అయిపోయింది. ఇప్పటి నుంచి వరసగా సినిమాలు ఇప్పటికే షెడ్యూల్ అయిపోయి ఉండటంతో నిశ్శబ్దంని ఫిబ్రవరి 20కి ఫిక్స్ చేయబోతున్నట్టు టాక్. హేమంత్ మధుకర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తోంది. హింది, తమిళ్, మలయాళంతో పాటు ఇంగ్లీష్ లో కూడా నిశబ్దం విడుదల చేయబోతున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetCasibomCasibomCasibomjojobetbetwooncasibomcasibombetcio giriş