iDreamPost
android-app
ios-app

కానిస్టేబుల్‌ దుస్తులు మార్చుకుంటుండగా చిత్రీకరణ .. మీడియా ప్రతినిధులపై నిర్భయ కేసు

కానిస్టేబుల్‌ దుస్తులు మార్చుకుంటుండగా చిత్రీకరణ  .. మీడియా ప్రతినిధులపై నిర్భయ కేసు

అమరావతి ప్రాంత గ్రామం మందడంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్‌ దుస్తులు మార్చుకుంటుండా కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులు వీడియో, ఫోటోలు తీయడం కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు వేగంగా స్పందించారు. ఈ చర్యకు పాల్పడిన మీడియా ప్రతినిధులపై నిర్భయ కేసు నమోదు చేశారు.

అమరావతిలో జరుగుతున్న ఆందోళనలు, అసెంబ్లీ, మండలి సమావేశాల బందోబస్తు కోసం మహిళా కానిస్టేబుళ్లు మందడం వచ్చారు. వారికి స్థాణిక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో బస ఏర్పాటు చేశారు. పాఠశాల పిల్లలను చెట్ల కింద కూర్చొపెట్టి.. తరగతి గదులను పోలీసుల వసతి కోసం ఇచ్చారు. ఈ విషయాన్ని కవర్‌ చేయడానికి కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులు వెళ్లారు.

Read Also: మండలి నిరవధిక వాయిదా… తర్వాత సమావేశాలు..

మహిళా పోలీసుల వసతి గదుల లోపల ప్రాంతాన్ని కిటికీల ద్వారా వీడియో, ఫోటోలు తీస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్‌ దుస్తులు మార్చుకుంటుండగా కిటికీలో నుంచి వీడియో, ఫోటోలు తీశారు. అయితే పొరపాటు జరిగిందంటూ.. సదరు మీడియా ప్రతినిధులు మహిళా కానిస్టేబుల్‌కు క్షమాపణలు చెప్పారు. ఈ విషయం పోలీసుల ఉన్నతాధికారులకు, ఇతర మీడియాకు తెలియడంతో వెలుగులోకి వచ్చింది. సదరు మీడియా ప్రతినిధులపై పోలీసు ఉన్నతాధికారులు ఫైర్‌ అయ్యారు. నిర్భయ కేసు నమోదు చేశామని, తప్పకుండా బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.