Dharani
Dharani
ప్రస్తుతం టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్‌లో పట్టుబడటం.. ఆయనతో పలువురు సెలబ్రిటీలు కాంటాక్ట్‌లో ఉండటంతో.. మరోసారి డ్రగ్స్ వ్యవహారం తెర మీద వచ్చింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు.. కేపీ చౌదరిని అదుపులోకి విచారిస్తుండగా.. కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆయన ఫోన్ డేటాతో పాటు గూగుల్ డ్రైవ్ డేటాను సేకరించగా.. అందులో చాలా మంది సెలెబ్రెటీలు, రాజకీయ నేతల బండారం బయటపడ్డట్టు సమాచారం. టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరో సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో అనేక సందర్భాల్లో తనకు కూడా డ్రగ్స్ ఆఫర్ చేశారని తెలిపాడు. ఆయన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కేసు వెలుగుచూడటంతో.. తెలంగాణ రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు హైదరాబాద్‌లో పరివర్త కార్యక్రమం ఏర్పాటు చేశారు. హీరో నిఖిల్, ప్రియదర్శి.. ఈ కార్యక్రమంలో పాల్గొని.. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు. ఈ సందర్భంగా నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తనకు కూడా చాలా సార్లు డ్రగ్స్ ఆఫర్ చేశారని.. కానీ తాను మాత్రం.. వాటి జోలికి వెళ్లలేదని తెలిపారు. ఒక్కసారి వాటికి అలవాటు పడితే.. ఇక మన జీవితం అక్కడితో ముగిసి పోతుందని.. అదే మనకు మరణ శాసనం అన్నారు.
డ్రగ్స్ మహమ్మారికి అందరూ దూరంగా ఉండాలని.. మరీ ముఖ్యంగా విద్యార్థులు, యువత.. తమ మీద తమకు సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలని సూచించారు. స్టూడెంట్స్‌కు ఎంతో జీవితం ఉందని.. ఆ లైఫ్‌ను ఎంజాయ్ చేయండని తెలిపారు. ‘‘పార్టీలకు వెళ్లండి.. ఎంజాయ్ చేయండి.. కానీ డ్రగ్స్ జోలికి మాత్రం వెళ్లకండి. ఒక్కసారి అవి మీ జీవితంలోకి ఎంట్రీ ఇస్తే.. మీరు ఈ లోకం నుంచి ఎగ్జిట్ అవుతారు’’ అని హెచ్చరించారు. త్వరలోనే డ్రగ్ ఫ్రీ తెలంగాణ అవ్వాలని కోరుకుంటున్నానన్నారు నిఖిల్.
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రియదర్శి మాట్లాడుతూ.. ఒకప్పుడు తాను కూడా సిగరెట్ తాగేవాడినన్నారు. కానీ దానికి అడిక్ట్ కావొద్దని సంకల్పించిన వెంటనే సిగరెట్ మానేసినట్టు తెలిపారు. ఇప్పుడు తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. ఎంతో సంతోషంగా ఉన్నట్లు వివరించారు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటి.. అవి మన జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి.. అనే అంశాలపై అందరికి అవగాహన రావాల్సిన అవసరం ఉందని ప్రియదర్శి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విద్యార్థుల కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టటం సంతోషంగా ఉందన్నారు ప్రియదర్శి.