iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్‌: ఐసిస్ లింకులు.. హైదరాబాద్‌లో NIA సోదాలు..

  • Published Sep 16, 2023 | 12:53 PMUpdated Sep 16, 2023 | 1:01 PM
  • Published Sep 16, 2023 | 12:53 PMUpdated Sep 16, 2023 | 1:01 PM
బ్రేకింగ్‌: ఐసిస్ లింకులు.. హైదరాబాద్‌లో NIA సోదాలు..

రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో.. ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. శనివారం ఉదయం నుంచి పాతబస్తీ సహా నగరంలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. ఐఎస్‌ఐ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే కాక.. తమిళనాడులోని 25 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తమిళనాడులోని కోయంబత్తూరు కారు పేలుడు కేసు ఘటనకు సంబంధించి.. ఐసిస్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

దీనిలో భాగంగా ఎన్‌ఐఏ తెలంగాణ, తమిళనాడులోని వేర్వురు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తుంది. తమిళనాడులోని 25 ప్రాంతాల్లో.. తెలంగాణలోని హైదరాబాద్‌లో నాలుగుచోట్ల ఎన్‌ఐఏ అధికారులు శనివారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. వివిధ సంస్థలుగా ఏర్పడి ఐఎస్‌ఐఎస్ఐ మాడ్యుల్‌లో అనుమానితులు పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. సోదాల్లో భాగంగా అధికారులు.. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి