iDreamPost
android-app
ios-app

వాహనదారులకు అలర్ట్.. రాంగ్ రూట్ లో వెళ్తున్నారా.. అయితే జైలుకే

  • Published Jun 22, 2024 | 12:14 PM Updated Updated Jun 22, 2024 | 12:14 PM

నగరంలో రాంగ్ రూట్ లలో ప్రయాణించడం వలన ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ శాతం రాంగ్ సైడ్ లో ప్రయాణించడం వలనే జరుగుతున్నాయని గుర్తించిడంతో తాజాగా నగరంలో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినంగా అమాలు చేయాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. 

నగరంలో రాంగ్ రూట్ లలో ప్రయాణించడం వలన ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ శాతం రాంగ్ సైడ్ లో ప్రయాణించడం వలనే జరుగుతున్నాయని గుర్తించిడంతో తాజాగా నగరంలో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినంగా అమాలు చేయాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. 

  • Published Jun 22, 2024 | 12:14 PMUpdated Jun 22, 2024 | 12:14 PM
వాహనదారులకు అలర్ట్.. రాంగ్ రూట్ లో వెళ్తున్నారా.. అయితే జైలుకే

నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ ట్రాఫిక్ సమస్యలకు తగ్గట్టుగానే రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో నగరంలో రోడ్డు ప్రమాదాలనేవి రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన వారి కంటే.. మరణించినవారే ఎక్కువ శాతం ఉంటున్నారు. అయితే ఇలా రోడ్డు ప్రమాదానికి గురైన వారిలో అతివేగం వెళ్లడం ఒక కారణమైతే.. మరొకటి భద్రతలను పాటించకుండా.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించడం వలనే ఎక్కువగా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులే ఎక్కువగా కావడంతో.. తాజాగా నగరంలో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినంగా అమాలు చేయాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు.

నగరంలో రాంగ్ రూట్ లో ప్రయాణం చేసేవారి పై ఇక నుంచి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రాంగ్ రూట్ ప్రయాణించిన వారు ఎవరరైనా సరే.. పోలీసులకు పట్టుబడితే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపించనున్నారు.  ఇందులో భాగంగానే నగరంలో మొదట రాంగ్ రూట్ ప్రయాణించే వాహనదారులపై సెక్షన్ 336 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ప్రారంభించారు. ఇక రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వారిపై సంబంధిత లా అండ్ ఆర్డర్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడుతుంది. ఇక ఆ తర్వాత.. ఛార్జిషీట్ దాఖలు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే నిన్న అనగా శుక్రవారం కమిషనరేట్‌ పరిధిలో రాంగ్‌ వే వాహనాలు నడుపుతున్న 93 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, వీరిలో 11 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అయితే స్టేషన్ల వారీగా చూస్తే.. ఎక్కువగా గచ్చిబౌలి పీఎస్ పరిధిలో రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తున్న 32 మంది పట్టుబడ్డారు. కాగా, వీరిలో నలుగురిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అలాగే కేపీహెచ్‌బీ పీఎస్‌ పరిధిలో ఐదుగురిని పట్టుకుని ఒకరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఇక కూకట్‌పల్లి పరిధిలో ముగ్గురిని, మాదాపూర్‌లో ఒకరిని, నార్సింగి ఠాణాలో 11 మందిని, రాయదుర్గంలో 20 మందిని, జీడిమెట్లలో 16 మందిని అరెస్టు చేసి, ఒకరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాంగ్ రూట్‌లో ప్రయాణించడం వల్ల రాంగ్ సైడ్ వాహనదారులే కాకుండా ఇతర వాహనదారులు కూడా ప్రమాదంలో పడుతున్నారు. ముఖ్యంగా ఇది చాలా ప్రమాదకరం. దీనిపై జరిమానాలు విధిస్తున్నా నిబంధనల ఉల్లంఘన తగ్గడం లేదు. అందువల్లే  ఇలా రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసే వాహనదారులపై సెక్షన్ 336 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాం. ఇక ఈ కేసులో మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కొన్నిసార్లు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు. అయితే గత నెలలో తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేశాం.ఈ క్రమంలోనే కమిషనరేట్ పరిధిలో మొత్తం 250 వాహనాలపై కేసులు పెట్టారు. కాగా, కమిషనరేట్‌లో 124 ప్రాంతాలను గుర్తించాం. ఇక అక్కడ తరచుగా రంగూట్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాల్లో ANPR కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కెమెరాలు తప్పు చేసిన వారిని గుర్తించి ఫొటోలు తీస్తాయి. వాటి ఆధారంగా నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తారు. మరి, నగరంలో రాంగ్ రూట్ వెళ్లే వారిపై ఈ రకమైన చర్యలు తీసుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.