iDreamPost
android-app
ios-app

IPL 2022 కొత్త టీములతో సరికొత్తగా ..

IPL 2022 కొత్త టీములతో సరికొత్తగా ..

2022 ఐపీఎల్ లో కొత్త జట్లు చూడబోతున్నామా? ఆట మరింత రసవత్తరంగా సాగనుందా? అంటే బీసీసీఐ అవుననే అంటోంది. ఇక మీదట ఐపీఎల్లో 10 జట్లు కనిపించబోతున్నాయని బీసీ అధికారులు చెబుతున్నారు. అదే నిజమైతే క్రికెట్ ప్రేమికులకు పండగే.

క్రికెట్ క్రీడాభిమానుల్ని ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చే ఏడాది నుంచి రెండు కొత్త జట్లతో కనిపించనుంది. ఈ ఏడాది 8 జట్లతో నే సీజన్ పూర్తి చేసి వచ్చే ఏడాది మరో రెండు కొత్త ఫ్రాంచైజీలతో నూతనంగా తీర్చిదిద్దేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. 8 జట్లతో ఇకమీదట ఐపీఎల్ నిర్వహించేది లేదని ఇదే చివరి దంటూ బీసీసీఐ పెద్దలు సైతం సంకేతాలు ఇచ్చారు. బీసీసీఐ కోశాధికారి అరుణ్ దుమాల్ దీనిపై బుధవారం మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది ఐపీఎల్ లో పది జట్లు ఉంటాయని స్పష్టం చేయడంతో పాటు, ప్రాచీన సంఖ్య పెరుగుతుందని తెలియజేయడంతో క్రికెట్ క్రీడా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్లో గతంలో పది జట్లు ఆడాయి. 2011 సీజన్ లో మొత్తం 10 వికెట్లు ఐపీఎల్లో తలపడ్డాయి. పూణే వారియర్స్ తోపాటు, కేరళ ఫ్రాంఛైజీ కోచి టస్కర్స్ ఆ లీగ్ లో సందడి చేసాయి. ఈ సీజన్ ను చెన్నై సూపర్ కింగ్స్ గెల్చుకుంది. కేవలం ఒకే జగన్ కు పరిమితమైన కోచి టస్కర్స్ తర్వాత కనిపించలేదు. 2012, 2013 ఐపీఎల్ సీజన్ లో తొమ్మిది జట్లతో జరిగాయి. ఆ తర్వాత పూణే వారియర్స్ సైతం కనుమరుగైంది. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నప్పటికీ ఫ్రాంఛైజీల మధ్య ఉన్న బేధాభిప్రాయాలు కారణంగానే ఆ రెండు ఫ్రాంచైజీలు రద్దయ్యాయి. దీని తర్వాత మళ్లీ ఐపీఎల్ లో కొత్త జట్టు ఏది ప్రవేశం చేయలేదు. ఎందరో వ్యాపారవేత్తలు కొత్త జట్లు తీసుకోవాలని ఆ పడుతున్నప్పటికీ బీసీసీఐ మాత్రం దీనికి అనుమతి తెలపలేదు.

Also Read : లార్డ్స్ లో భారత్ చారిత్రాత్మక విజయం

గత ఏడాదే కొత్త జట్ల ప్రతిపాదన వచ్చింది. గుజరాత్ తో పాటు లక్నో జట్టు వస్తాయని జోరుగా ప్రచారం జరిగింది. దీనికి కొందరు వ్యాపారవేత్తలు సైతం బిసిసిఐ తో సంప్రదింపులు జరిపారు. అయితే కొన్ని కారణాల రీత్యా ఉన్న కాంట్రాక్టుల దృష్ట్యా బిసిసిఐ కొత్త ఫ్రాంఛైజీల ఏర్పాటుకు సుముఖత చూపలేదు. కరోనా దెబ్బకు వరుసగా రెండు సీజన్లలో నష్టపోయిన బీసీసీఐ ఆ లోటును భర్తీ చేసుకునేందుకు కచ్చితంగా వచ్చే ఏడాది కొత్త ఫ్రాంచైజీలు ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీనివల్ల మ్యాచ్ల సంఖ్య పెరగడంతో పాటు బిసిసిఐకి వచ్చే ఆదాయం సైతం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తోంది.

ఈ ఏడాది ఆగిపోయిన ఐపీఎల్ ను దుబాయ్ వేదికగా వచ్చేనెలలో నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ ప్రేక్షకులను అనుమతించాలని దుబాయ్ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఐపీఎల్ తర్వాత 20 20 వరల్డ్ కప్ సైతం దుబాయిలోని జరగనుంది. దుబాయ్ ప్రభుత్వం వ్యాక్సినేషన్ పట్ల పూర్తి జాగ్రత్తగా వ్యవహరిస్తుండడంతో ఈసారి ఐపీఎల్ లో ప్రేక్షకుల తోనే ఆడించేందుకు బీసీసీఐ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మరోపక్క వచ్చే 20 20 వరల్డ్ కప్ కూడా ప్రేక్షకుల మధ్యలో జరిగితేనే బాగుంటుందని బిసిసిఐ భావిస్తోంది. దీంతో టికెట్ ఆదాయమే కాకుండా, ఆటగాళ్లకు మంచి ఉత్సాహం వస్తుందని భావన.

బీసిసిఐ వచ్చే ఏడాది నుంచి కొత్త జట్లతో ఐపీఎల్ ఉంటుందని చెప్పడం తో ఆశావహులు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా గుజరాత్ లయన్స్ జట్టు ఖచ్చితంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు అతిపెద్ద రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ కు సైతం ప్రాతినిధ్యం కల్పించాలి అని డిమాండ్లు గతంలోనే వచ్చాయి. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి లక్నో ఫ్రాంచైజీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా కాకుంటే మిగిలిన పెద్ద రాష్ట్రాలు, నగరాలు వారీగా ఫ్రాంచైజీ ఇచ్చేందుకు బిడ్ ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఎవరు పెద్ద మొత్తంలో బిడ్ దాఖలు చేస్తే వారికీ కొత్త ఫ్రాంచైజీలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన రాష్ట్రం నుంచి కూడా విశాఖపట్నం ఫ్రాంచైజీ చేసేందుకు గతంలో ప్రచారం జరిగినా అది వాస్తవ రూపం దాల్చలేదు. అయితే రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు ఎవరైనా వైజాగ్ ఫ్రాంచైజీ కోసం పట్టుబడితే మాత్రం కచ్చితంగా ఆంధ్ర ప్రదేశ్ కు ఐపీఎల్లో ప్రాతినిధ్యం ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు వైజాగ్ లో అంతర్జాతీయ మైదానంలో ఉండటం పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది.

Also Read : లార్డ్స్ మ్యాచ్ సరి కొత్త రికార్డ్స్