iDreamPost
android-app
ios-app

కొత్త పింఛన్లు మంజూరుకు ముహూర్తం

కొత్త పింఛన్లు మంజూరుకు ముహూర్తం

కొత్తగా పింఛన్లు పొందేందుకు ఎదురుచూస్తోన్న వారికి ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ నూతన ఏడాది ప్రారంభంలో తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ఏపీ సర్కార్‌ రంగం సిద్ధం చేస్తోంది. పింఛన్లు పొందేందుకు ఇప్పటికే అర్హులైన వారు దరఖాస్తు చేసుకోగా, ఆయా దరఖాస్తులను క్రోడీకరిస్తున్నారు. అందులో అర్హులైన వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు.

Read Also: ఇచ్చిన మాట కంటే మిన్నగా..

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కొత్త పింఛన్లు కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటున్నారు. నవంబర్‌ 20వ తేదీ నుంచి 30 వరకు నవశకం పేరుతో వాలంటీర్లు ఇంటింటి సర్వే ద్వారా మిగిలిన వారి నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఆ సమాచారాన్ని ఆన్‌లైన్‌ చేశారు.

చంద్రబాబు ప్రభుత్వంలో పింఛన్‌ అర్హతకు విధించిన 65 ఏళ్ల వయస్సును 60 ఏళ్లకు తగ్గించారు. 5 ఎకరాల భూ పరిమితిని 10 ఎకరాలకు చేశారు. ఫలితంగా భారీగా లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 53.19 లక్షల మందికి ప్రతి నెల పింఛన్లు ఇస్తున్నారు. 13 విభాగాల్లో నెలకు 2,250 రూపాయల నుంచి 10 వేల వరకు ప్రతి నెలా లబ్ధిదారులు పింఛన్‌ అందుకుంటున్నారు.