iDreamPost
android-app
ios-app

ఆగస్ట్ మొదటి వారం – OTT వినోదం

  • Published Aug 04, 2022 | 2:24 PM Updated Updated Dec 23, 2023 | 6:51 PM

ఇక ఈ వారం విడుదల కాబోతున్న కంటెంట్ మీద లుక్ వేస్తే ఇవాళ అర్ధరాత్రి నుంచి గోపీచంద్ 'పక్కా కమర్షియల్'(PakkaCommercial)(AHA) ఆహాలో అందుబాటులోకి రానుంది.

ఇక ఈ వారం విడుదల కాబోతున్న కంటెంట్ మీద లుక్ వేస్తే ఇవాళ అర్ధరాత్రి నుంచి గోపీచంద్ 'పక్కా కమర్షియల్'(PakkaCommercial)(AHA) ఆహాలో అందుబాటులోకి రానుంది.

  • Published Aug 04, 2022 | 2:24 PMUpdated Dec 23, 2023 | 6:51 PM
ఆగస్ట్ మొదటి వారం – OTT వినోదం

థియేటర్లకు ధీటుగా ఓటిటిలు ప్రతి శుక్రవారం కొత్త రిలీజులతో పోటీ పడుతున్నాయి. ఇవీ బాక్సాఫీస్ సంప్రదాయాన్ని పాటించడం విచిత్రమే అయినప్పటికీ కొన్ని మాత్రం ఈ మధ్య రూటు మార్చి సండేకి షిఫ్ట్ అవుతున్నాయి. ఇక ఈ వారం విడుదల కాబోతున్న కంటెంట్ మీద లుక్ వేస్తే ఇవాళ అర్ధరాత్రి నుంచి గోపీచంద్ ‘పక్కా కమర్షియల్'(PakkaCommercial)(AHA) ఆహాలో అందుబాటులోకి రానుంది. టైటిల్ కు తగ్గట్టు వసూళ్లు తెలీకపోయినా బ్యాడ్ టాక్ వల్ల చూడని వాళ్ళు చాలానే ఉంటారు కాబట్టి ఇది చిన్న తెరపై ఏదైనా మేజిక్ చేస్తుందేమో చూడాలి. మారుతీ బ్రాండ్, రాశిఖన్నా గ్లామర్, సత్యరాజ్ లాంటి క్యాస్టింగ్ వగైరా ఆకర్షణలు హోమ్ ఆడియన్స్ ని ఆకట్టుకోగలిగితే వ్యూస్ వస్తాయి.

హన్సిక నటించిన తన యాభైవ సినిమా ‘మహా’ ఆహాలోనే వస్తోంది. ఇది అట్టర్ ఫ్లాప్ మూవీ. శింబు స్పెషల్ క్యామియో చేసినప్పటికీ జనం కొంచెం కూడా పట్టించుకోలేదు. తమిళంలోనూ ఇది డిజాస్టరే. సరే టైంపాస్ కోసం ఓ లుక్ వేద్దామనుకునే వాళ్ళు ఉంటారు. మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన ‘కడువా’ ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ మొదలుపెట్టేసింది. రెండు మూడు రోజుల్లో తెలుగు ఆడియోని జోడించబోతున్నారు. అప్పటిదాకా వెయిట్ చేయలేమంటే సబ్ టైటిల్స్ సహాయంతో లాగించేయడమే. అలియా భట్ కీలక పాత్ర పోషించిన’ డార్లింగ్స్’ రేపే నెట్ ఫ్లిక్స్ లో రానుంది. ట్రైలర్ చూశాక దీని మీద అంచనాలు ఏర్పడ్డాయి. డబ్డ్ వెర్షన్ ఉంటుంది

మూడు రోజులు ఆలస్యంగా లావణ్య త్రిపాఠి ‘హ్యాపీ బర్త్ డే’ని 8న నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయబోతున్నారు. ఇదీ పోయిన బొమ్మే కానీ ట్రెండీ కంటెంట్ ఏమైనా నెటిజెన్స్ ని ఆకట్టుకుంటుందేమో చూడాలి. అమెజాన్ ప్రైమ్ కొత్త వెబ్ సిరీస్ ‘క్రాష్ కోర్స్’ 5కే వస్తోంది. హాలీవుడ్ లవర్స్ కోసం లైట్ ఇయర్ హాట్ స్టార్లో, సాండ్ మ్యాన్ నెట్ ఫ్లిక్స్ లో, ది గ్రేట్ వెడ్డింగ్ అఫ్ మున్నెస్ వెబ్ సిరీస్ ఊట్ సెలెక్ట్ లో, సత్యరాజ్ కొడుకు శిబిరాజ్ నటించిన ‘మాయోన్’ సింప్లీ సౌత్ లో అందుబాటులోకి వస్తాయి. మరి ఇంతేసి వినోదం ఇంటికి వస్తుండగా థియేటర్లలోనూ చెప్పుకోదగ్గ సినిమాలు ముస్తాబవుతున్నాయి. ఏది చూడాలనే ఛాయస్ అండ్ ప్లేస్ ఇక ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio