iDreamPost
android-app
ios-app

నాని ‘వి’ గురించి కొత్త లీక్స్

  • Published Jun 27, 2020 | 11:28 AM Updated Updated Jun 27, 2020 | 11:28 AM
నాని ‘వి’ గురించి కొత్త లీక్స్

అసలు కరోనా రాకపోయి లాక్ డౌన్ లేకపోయి ఉంటే నాని వి సినిమా ఇప్పటికే డిజిటల్ తో పాటు శాటిలైట్ లో కూడా వచ్చేసేది. మార్చ్ 25 నుంచి ఇప్పటిదాకా నిరవధికంగా వాయిదా పడిన వి థియేటర్లు తెరుచుకోవడం కోసం ఎదురు చూస్తోంది. ఓటిటిలో రావొచ్చని గట్టి ప్రచారమే జరిగింది కాని గత నెల రోజులకు పైగా ఎలాంటి అప్ డేట్స్ లేక నాని అభిమానులు డీలాపడి పోయారు. హాళ్ళు తెరుచుకున్నాక ప్రాధాన్యత క్రమంలో ముందు రిలీజ్ కావాల్సిన మూవీ వినే. ఇక దీనికి సంబంధించిన కొత్త లీక్స్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటి ప్రకారం ఇందులో నాని మిలిటరీ ఆఫీసర్ గా కనిపిస్తాడట. అయితే ఇతను ఇంటలిజెంట్ కిల్లర్ గా మారి వరసగా ఎందుకు హత్యలు చేయాల్సి వస్తుందనేదే అసలు కథ అని చెబుతున్నారు.

పోలీస్ ఆఫీసర్ పాత్ర ధరిస్తున్న సుధీర్ బాబుకి నానికి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ గతంలో చూసిన మైండ్ బేస్డ్ సినిమాల కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుందట. ఊహించని మలుపులతో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దీన్ని తెరకెక్కించినట్టు వినికిడి. హీరొయిన్ ఆదితి రావు హైదరి కథల౦ఒ కీలక భాగంగా ఉంటూ నాని పగకు కారణంగా నిలుస్తుందట. ఇంటర్వెల్ తో పాటు ప్రీ క్లైమాక్స్ నుంచి నాని ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమని ఇన్ సైడ్ టాక్. ఏది ఎలా ఉన్నా నెగటివ్ షేడ్స్ లో నానిని చూసి చాలా కాలమయ్యింది. ఇంత ప్రత్యేకంగా ఒప్పుకున్నాడు అంటే అందులో ఏదో విశేషం ఉండే ఉంటుంది.

సైరా ఫేం అమిత్ త్రివేది సంగీతం సమకూర్చిన వికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తమన్ ఇవ్వడం అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. సెప్టెంబర్ లో కనక థియేటర్లు ఓపెన్ అయితే వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు సిద్ధంగా ఉన్నారు. జనం రావాలంటే నాని లాంటి రేంజ్ ఉన్న హీరో అయితేనే సాధ్యమవుతుంది. అందుకే ఇప్పటిదాకా ఓటిటి పరంగా ఎన్ని టెంప్ట్ చేసే ఆఫర్స్ వచ్చినా చలించకుండా ఎదురు చూశారు. ఒకవేళ ప్రభుత్వం జూలై లేదా ఆగష్టు నుంచి అనుమతులు ఇస్తే దసరా లోపే నాని విని చూడొచ్చు. దీని డిజిటల్ హక్కులు ఆహాకిచ్చారనే టాక్ అయితే ఉంది కాని దానికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ అప్ డేట్ ఇప్పటిదాకా రాలేదు