iDreamPost
android-app
ios-app

తెలంగాణ రైతులకు బిగ్‌ అలర్ట్‌.. రైతు బీమాపై ప్రభుత్వం కీలక ప్రకటన!

  • Published Jul 06, 2023 | 12:04 PMUpdated Jul 06, 2023 | 12:04 PM
  • Published Jul 06, 2023 | 12:04 PMUpdated Jul 06, 2023 | 12:04 PM
తెలంగాణ రైతులకు బిగ్‌ అలర్ట్‌.. రైతు బీమాపై ప్రభుత్వం కీలక ప్రకటన!

రైతే రాజు.. అన్నదాత దేశానికి వెన్నుముక ఇలాంటి స్లోగన్స్‌ వినడానికి చాలా బాగుంటాయి. కానీ ఆచరణలో.. ఇందుకు పూర్తిగా రివార్స్‌ సీన్‌ కనిపిస్తుంది. దేశానికి అన్నం పెట్టే రైతన్న వెన్నుముక.. అప్పుల భారంతో వంగి పోయింది. ప్రభుత్వాలు, దళారులు, మార్కెట్‌లు ఆఖరికి దైవం కూడా రైతన్నను మోసం చేసే జాబితాలో ప్రథమ స్థానంలో ఉంటారు. సాగు ఖర్చు పెరిగింది.. రాబడి తగ్గింది. కల్తీ విత్తనాలు, మందులు, అన్ని దాటుకుని మార్కెట్‌కి వస్తే మద్దతు ధర లభించదు.. ఏదో ఒక ధరకు పంటను అమ్ముదామనుకుని మార్కెట్‌లో నిరీక్షిస్తే.. నేనున్నాను అంటూ వరుణుడు ఎంట్రీ ఇస్తాడు. ఇలా విత్తు భూమిలో నాటి నుంచి.. పంటను అమ్ముకుని డబ్బు చేతికి వచ్చే సరికి.. రైతు పడే వేదన పురిటి నొప్పులకు ఏమాత్రం తీసిపోదు.

అలాంటి రైతన్న అకస్మాత్తుగా మరణిస్తే.. ఆ కుటుంబం పరిస్థితి ఏంటి.. వారిని ఎవరు ఆదుకుంటారు.. కుటుంబానికి పెద్ద దిక్కు మరణిస్తే.. ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. అదిగో ఆ పరిస్థితి మార్చడానికి.. అన్నదాత కుటుంబానికి అండగా నిలివడానికి కేసీఆర్‌ సర్కార్‌ ముందడుడు వేసింది. అన్నదాత ఆకస్మాత్తుగా మృతి చెందితే.. ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండటం కోసం.. రైతు బీమా పేరిట.. అన్నదాత కుటుంబానికి ఐదు లక్షల రూపాయల సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతు బీమాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..

రైతు బీమాకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ రైతులకు బిగ్‌ అలర్ట్‌ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 10 నుంచి రైతు బీమా పథకానికి నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. కొత్తగా, అర్హులైన రైతులను ఈ పథకంలో చేర్చాలని.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసయ శాఖ అధికారులను ఆదేశించింది. జూలై 10 న ప్రారంభం అయ్యే నమోదు ప్రక్రియ ఆగస్టు 5 వరకు కొనసాగనుంది. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న రైతులకు ఈ పథకం వర్తిస్తుంది.

జూన్ 18 వరకు పట్టాదారు పాసుపుస్తకం పొందిన రైతులు మాత్రమే రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కాగా ఇటీవలే కేసీఆర్‌ సర్కార్‌ రాష్ట్రంలోని రైతులకు.. ఈ సీజన్‌కు సంబంధించి రైతు బంధు నిధులను విడుదల చేసిన సగంతి తెలిసిందే. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 10 నుంచి రైతు బీమా పథకానికి నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ రెండు పథకాలు.. రైతులకు ఏంతో మేలు చేశాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి