iDreamPost
android-app
ios-app

రాజమౌళి RRR ‘గే లవ్ స్టోరీ’, రెసూల్ పూకుట్టి కామెంట్స్ పై ర‌గిలిపోతున్న‌ ఫ్యాన్స్

  • Published Jul 04, 2022 | 3:56 PM Updated Updated Jul 04, 2022 | 3:56 PM
  • Published Jul 04, 2022 | 3:56 PMUpdated Jul 04, 2022 | 3:56 PM
రాజమౌళి RRR ‘గే లవ్ స్టోరీ’, రెసూల్ పూకుట్టి కామెంట్స్ పై ర‌గిలిపోతున్న‌ ఫ్యాన్స్

ఆస్కార్-విజేత సౌండ్ డిజైనర్ రెసూల్ పూకుట్టి SS రాజమౌళి సినిమా RRRను దారుణంగా హేళ‌న చేసిందుకు ఫ్యాన్స్ దారుణంగా అత‌న్ని ట్రోల్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ‘గే లవ్ స్టోరీ అని వ్యాఖ్యానించిన‌ ర‌సూల్, సినిమాలో ఆలియా భట్ కు పెద్ద పాత్ర ఏం లేద‌ని, ఒక ఆస‌రాగా ఉంద‌ని కామెంట్ చేశాడు.

ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆర్ఆర్ఆర్ స్టార్ సౌండ్ డిజైనర్ రెసూల్‌ను ఆకట్టుకోలేకపోయింది. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ RRRను రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు న‌టించిన‌ గే లవ్ స్టోరీగా కామెంట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆలియా భట్‌ని ఒక ప్రాప్ లా చూశారన్న‌ రెసూల్ కామెంట్ తో, అభిమానులు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

ఆర్ఆర్ఆర్ ను అంత‌ర్జాతీయంగా, ముఖ్యంగా హాలీవుడ్ నిపుణులు ప్ర‌శంసిస్తున్న వేళ‌, ఒక గే లవ్ స్టోరీ గా కామెంట్ చేస్తే ఫ్యాన్స్ ఊరుకొంటారా? “ఆస్కార్ విజేత నుండి దీనిని ఊహించలేదని ఒక యూజ‌ర్ అంటే ఈ క‌థ‌ #LGBT అయినా అవమానంలేదు, ఎవ‌రికీ న‌ష్టం లేదు. ఆస్కార్ అవార్డు గ్రహీత నుంచి ఇంత చౌక‌బారు వ్యాఖ్య‌లు వ‌స్తాయ‌ని ఊహించలేదు. మ‌న‌కు సంతృప్తినివ్వ‌క‌పోయినా, భాషతో సంబంధం లేకుండా వృత్తికి గౌరవం ఇవ్వాలని సూచించిన మ‌రో యూజ‌ర్, ఇలాంటి కామెంట్స్ ను నీతిబాహ్యంగా వ‌ర్ణించాడు. మ‌రొక‌త‌ను ట్రోల్ లా బిహేవ్ చేస్తున్నాడ‌ని రాశాడు.

సౌండ్ డిజైనర్ మ‌రో కామెంట్ కూడా చేశాడు. రామ్ చరణ్ , అజయ్ దేవగన్ ప‌క్క‌న న‌టించిన అలియా భట్ , శ్రియా శరణ్‌లకు ఏదో పేరుకు మాత్ర‌మే పాత్ర‌లిచ్చార‌ని వ్యాఖ్యానించాడు. నిజానికి ఆర్ఆర్ఆర్ లో త‌న‌ సన్నివేశాలను కత్తిరించినందుకు ఆలియా అలిగిన‌ట్లు చాలా క‌థ‌నాలు వ‌చ్చాయి. ఆమె ఫ్యాన్స్ కూడా ఆమె స్క్రీన్ స్పేస్ పట్ల సంతోషంగా లేరు. ఆలియా ఆ త‌ర్వాత ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చింది. తాను రాజమౌళికి వీరాభిమానిని, RRRలో న‌టించినందుకు కృతజ్ఞతలు చెప్పిందికూడా. ఇక‌ ఆ సినిమా అఖండ విజయం సాధించడంతో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఓవర్‌నైట్ స్టార్ లు అయిపోయారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş