iDreamPost
android-app
ios-app

నెట్ సినిమా రిపోర్ట్

  • Published Sep 11, 2021 | 4:43 AM Updated Updated Sep 11, 2021 | 4:43 AM
నెట్ సినిమా రిపోర్ట్

నిన్నంతా టక్ జగదీష్, సీటిమార్ హడావిడిలో పడిపోయాం కానీ ఓటిటిలో మరో సినిమా కూడా రిలీజయ్యింది. అదే నెట్. జీ5లో అందుబాటులోకి వచ్చిన ఈ మూవీకి ఏమంత బజ్ లేదు కానీ ప్రధాన పాత్ర పోషించిన రాహుల్ రామకృష్ణ కొద్దిరోజుల క్రితం విమర్శలకు గురయ్యేలా ట్వీట్ చేయడంతో అంతో ఇంతో జనాల దృష్టి పడింది. ట్రైలర్ కూడా కాస్త ప్రామిసింగ్ గా అనిపించడంతో కొద్దిపాటి అంచనాలు రేగాయి. ఉయ్యాల జంపాల-సినిమా చూపిస్త మావ ఫేమ్ అవికా గోర్ మరో లీడ్ రోల్ చేసిన ఈ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ కు దర్శకుడు భార్గవ్ మాచర్ల. మరి ఇందులో ఏదైనా సర్ప్రైజ్ ఉందా హీరో చెప్పుకున్న స్థాయిలో మ్యాటర్ ఉందా రిపోర్ట్ లో చూద్దాం

మొబైల్ షాప్ నడుకుంటూ జీవనోపాధి చూసుకున్న లక్ష్మణ్(రాహుల్ రామకృష్ణ)కు జీవితంలో సంతృప్తి ఉండదు. వచ్చే ఆదాయం చాలక ఇష్టం లేని పెళ్లి చేసుకున్న భార్య సుచిత్ర(ప్రణీత పట్నాయక్)ను సంతోష పెట్టలేక ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు. ఈ క్రమంలో బ్లూ ఫిలింస్ చూసేందుకు అలవాటు పడతాడు. వీటి దెబ్బకు చేతిలో కాసిన్ని డబ్బులు కూడా ఖర్చవ్వడం మొదలవుతుంది. ఓ యాప్ ద్వారా ఇళ్లల్లో ప్రైవేట్ సిసి ఫుటేజ్ చూసేందుకు చందా తీసుకుంటాడు. అప్పుడే ప్రియా(అవికా గోర్)ని జీవితంలోకి చూస్తాడు. బాయ్ ఫ్రెండ్ ఆమెను మోసం చేస్తున్న వైనం కంటపడుతుంది. తర్వాత ఏం జరిగిందో అసలు మూవీలో చూడాలి

పక్కోళ్ల ఇళ్లల్లో ఏం జరుగుతుందో విపరీతమైన ఆసక్తి చూపించే సగటు మనిషి మనస్తత్వాన్ని కాన్సెప్ట్ గా తీసుకుని ఓ సందేశం ఇచ్చే ప్రయత్నం చేసిన దర్శకుడు భార్గవ్ పూర్తి స్థాయిలో కాకపోయినా తాను చెప్పాలనుకున్న పాయింట్ ని డీసెంట్ గానే ప్రెజెంట్ చేశాడు. చాలా తక్కువ నిడివి ఉన్నా కూడా ల్యాగ్ అనిపించడానికి కారణం పూర్తి స్థాయి గ్రిప్పింగ్ గా సాగాల్సిన సన్నివేశాలు మాములుగా ఉండటం. ఈ లోపాన్ని మినహాయిస్తే ఇది మరీ తీసిపారేసే ప్రయత్నం అయితే కాదు. రాహుల్ రామకృష్ణ మాత్రం తన పెర్ఫార్మన్స్ తో కట్టిపడేశాడు. ఈ సినిమా చూసేందుకు ఒక కారణం చాలనుకుంటే అది అతనే అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు

Also Read : సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్.. ఇంకా వెంటిలేటర్ మీదే.. డాక్టర్లు ఏమన్నారంటే?