iDreamPost
android-app
ios-app

పాన్ ఇండియా ప్లాన్లు మారాల్సిందే

  • Published Jul 12, 2020 | 9:06 AM Updated Updated Jul 12, 2020 | 9:06 AM
పాన్ ఇండియా ప్లాన్లు మారాల్సిందే

లాక్ డౌన్ కు ముందు ఏమోగాని ఇప్పుడు సినిమా నిర్మాణానికి సంబంధించిన లెక్కలు చాలా మారబోతున్నాయి. కరోనా మహమ్మారి పూర్తిగా కనుమరుగు కావడానికి ఇంకా నెలలు పట్టేలా ఉండటంతో ప్రొడక్షన్ కు విషయంలో నిర్మాతలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి పాన్ ఇండియా మూవీస్ మీదే నిలుస్తోంది. ఒకే సినిమాను వేర్వేరు భాషల్లో ఒకేసారి విడుదల చేయడం ద్వారా ఎక్కువ రెవిన్యూ వచ్చేలా డిజైన్ చేసుకున్న ఈ మోడల్ బాహుబలి నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ తర్వాత స్టార్లందరూ ఇదే మంత్రాన్ని జపించడం మొదలుపెట్టారు. సాహో లాంటివి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోగా డియర్ కామ్రేడ్ బ్యాడ్ రిజల్ట్ ని అందుకోవాల్సి వచ్చింది. సైరా గురించి తక్కువ చెప్పుకుంటే మంచిది.

ఇప్పుడు షూటింగ్ పెండింగ్ లో ఉన్న రాధే శ్యామ్. పుష్ప, ఫైటర్, ఆర్ఆర్ఆర్ తదితరాలు నార్త్ ఆడియన్స్ టేస్ట్ ని దృష్టిలో పెట్టుకుని క్యాస్టింగ్ ని సెట్ చేసుకున్నవి. వందల కోట్ల బడ్జెట్ తో ముడిపడ్డవి. మల్టీ లాంగ్వేజ్ కావడంతో ఒకే సీన్ ని రెండు మూడు భాషల్లో తీయడం వల్ల కాస్ట్ పెరిగిపోతుంది. దాంట్లో ఏముంది అదే ఖర్చు కదా అనిపిస్తుంది కానీ ప్రాక్టికల్ గా దీని లెక్క వేరే ఉంటుంది. ఇంతకుముందుల బడ్జెట్ ని అపరిమితంగా పెట్టే అవకాశం ఇకపై ఉండకపోవచ్చు. అందులోనూ బాహుబలి తర్వాత ఆ స్థాయిలో సునామి సృష్టించిన తెలుగు సినిమా వేరేదీ లేదు. నార్త్ ఆడియన్స్ ఏదో డబ్బింగ్ రూపంలో ఫ్రీగా యూట్యూబ్ లో చూడమంటే వందల మిలియన్ల వ్యూస్ ఇస్తారు కానీ టికెట్ కొని మన చిత్రాలను థియేటర్లో చూడమంటేనే వస్తుంది అసలు చిక్కు. అందుకే ఇక్కడి డిజాస్టర్లు ఆన్లైన్ లో రికార్డులు కొల్లగొడుతున్నాయి. అంతమాత్రాన వాళ్లంతా టికెట్లు కొనే రకం కాదు.

ఇది దృష్టిలో పెట్టుకునే ఇకపై పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. రాబోయే కాలంలో థియేటర్లో అడుగు పెట్టాల్సిన బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలే చాలా ఉన్నాయి. వాటికి పోటీకి మనవి నిలబెట్టినా ప్రయోజనం ఉండదు. గత ఏడాది హృతిక్ రోషన్ వార్ ని ఢీ కొట్టడం ద్వారా సైరాకు జరిగిన డ్యామేజ్ చిన్నది కాదు. అందుకే విడుదల తేదీ విషయంలో చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది. బాహుబలి ఫాంటసీ మూవీ కాబట్టి అందరికీ అప్పీల్ అయ్యింది కానీ మన కమర్షియల్ సినిమాలకు కూడా అదే స్థాయి రెస్పాన్స్ ని ఆశించడం కరెక్ట్ కాదు. పాన్ ఇండియా అనే ట్యాగ్ ఒకప్పుడు గ్రాండ్ గా వినిపించేది కానీ ఇప్పుడు చిన్న హీరోలు సైతం ఈ ట్యాగ్ తో ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తుంటే ఇది కూడా ఓ మాములు పదమైపోయింది. అందుకే ఇకపై కొత్త వర్డ్ ఏదైనా కనిపెట్టాలి