iDreamPost
android-app
ios-app

Nayanthara, Vignesh Shivan Marriage: ఒక్క‌టైన‌ నయన్‌-విఘ్నేశ్ , ఆ హీరోను పిలిచినందుకు ఫ్యాన్స్ అప్ సెట్

  • Published Jun 09, 2022 | 12:53 PM Updated Updated Jun 09, 2022 | 3:26 PM
Nayanthara, Vignesh Shivan Marriage: ఒక్క‌టైన‌ నయన్‌-విఘ్నేశ్ , ఆ హీరోను పిలిచినందుకు ఫ్యాన్స్ అప్ సెట్

కోలీవుడ్ ఎదురుచూస్తున్న‌నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గురువారం తెల్లవారు జామున 2.22 గంటలకు నయన్‌-విఘ్నేశ్‌లు ఏడడుగులు వేశారు. వాయిదాలుప‌డుతూ వ‌స్తున్న ఈ పెళ్లి మొత్తానికి మహాబలిపూరంలోని రిసార్ట్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సెలబ్రిటీల మ‌ధ్య జరిగింది. ఈ పెళ్లికి పలువురు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, షారుక్‌ ఖాన్‌లు హజరైయ్యారు.

ఈ పెళ్లిని క‌ట్టుదిట్టంగా ఎలాంటి ఫోటోలు, వీడియోలు బైట‌కు రాకుండా ప్రైవేట్ గా నిర్వ‌హిస్తున్నారు. అందుకే పెళ్లి మండ‌పం నుంచి ఎలాంటి ఫోటోలు బైట‌కు రాలేదు. రజనీకాంత్‌ కారు దిగి లోపలికి వెళుతున్న ఫొటోత‌పాటు, పెళ్లికి ముందు షారుక్‌ స్టైలిష్‌ లుక్‌లో క‌నిపించారు. ఈ ఫొటోను షారుక్‌ మేనేజర్‌ పూజా దద్దాని షేర్‌ చేసింది. షారుక్‌తో జ‌వాన్ ను డైరెక్ట‌ర్ చేస్తున్న అట్లీ కూడా పెళ్లికి హజరయ్యాడు. స్టార్లు అజిత్‌, కార్తీ, విజయ్‌, చిరంజీవితో సినీ సెలబ్రెటీలు సైతం పెళ్లికి హజరైనట్లు తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Atlee (@atlee47)

పెళ్లికి ముందు విఘ్నేశ్ శివన్‌ నయన్‌పై ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు. వధువుగా ముస్తాబై పెళ్లిమండపంలోకి వ‌స్తుంటే చూడాలని ఎదురు చూస్తున్నానంటూ కాబోయో భార్య గురించి పోస్ట్‌ షేర్‌ చేశాడు విఘ్నేశ్‌. తన ఆనందాన్ని, ప్రేమను నయన్‌కు అంకితం ఇస్తున్నానంటూ ఎమోష‌న‌లైయ్యాడు విఘ్నేశ్‌. ఎంతోకాలం నుంచి ఈ పెళ్లికోసం క‌ల‌లుకంటున్నాడు మ‌రి!

 

అంతా బాగానే ఉన్నా, న‌య‌న్ ఫ్యాన్స్ మాత్రం ఒక విష‌యంలో నిరుత్సాహ‌ప‌డ్డారు. త‌మ పెళ్లికి హీర్ దిలీప్ ను ఆహ్వానించ‌డం ఆమె ఫ్యాన్స్ కు న‌చ్చ‌లేదు. 2017 మ‌ల‌యాళం న‌టి మీద దాడి కేసులో నిందుతుడైన దిలీప్ ను పిలవ‌డం ఆమె స్థాయికి త‌గిందికాద‌న్న‌ది ఫ్యాన్స్ మాట‌. మ‌హిళా సాధిక‌ర‌త‌మీద మాట్లాడే న‌య‌న్, మ‌రో మ‌హిళ మీద ఎటాక్ చేయించిన వ్య‌క్తిని పిల‌వ‌కూడ‌ద‌ని అంటున్నారు.