iDreamPost
android-app
ios-app

నయన్-విగ్నేష్ పెళ్లి.. ఎంత మంచి మనసో.. లక్ష మంది అనాధలు, వృద్ధులకు భోజనాలు..

  • Published Jun 11, 2022 | 8:20 PM Updated Updated Jun 11, 2022 | 8:20 PM
నయన్-విగ్నేష్ పెళ్లి.. ఎంత మంచి మనసో.. లక్ష మంది అనాధలు, వృద్ధులకు భోజనాలు..

గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న నయనతార, విగ్నేష్ తాజాగా చెన్నైలో జూన్‌ 9న సాంప్రదాయబద్దంగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లిని వీరు ఘనంగా చేసుకోవడం కాదు, అందరికి గుర్తుండిపోయే మంచి పని కూడా చేశారు నయన్ -విగ్నేష్. వీరిద్దరికి దైవ భక్తి, సేవా గుణం ఎక్కువే. పెళ్లి తర్వాత డైరెక్ట్ తిరుమల వచ్చి దర్శనం కూడా చేసుకున్నారు.


అయితే నయన్ -విగ్నేష్ పెళ్లి సందర్భంగా తమిళనాడులోని పలు అనాధాశ్రమాలు. వృద్దాశ్రమాల్లో ఉన్న దాదాపు లక్షమంది అనాధలకు, వృద్ధులకు మంచి విందు భోజనం పెట్టించారు. అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్ప అనే మాటని పాటించి ఎంతోమందికి కడుపు నింపారు. వారి పెళ్లిని ఇలా ఎంతోమంది గుర్తుంచుకునేలా ఈ మంచిపని చేశారు. నయనతార అభిమానుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తమిళనాడు వ్యాప్తంగా జరిగింది. దీనికి కావాల్సిన మొత్తం డబ్బు వీరే ఇచ్చారు. దీంతో అన్నదానం స్వీకరించిన వారంతా ఈ కొత్త జంట చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. ఇక ఈ పని చేసిన వీరిద్దర్నీ అందరూ అభినందిస్తున్నారు.