iDreamPost
android-app
ios-app

భర్తకు 20కోట్ల బంగ్లా.. నయన్ స్పెషల్ గిఫ్ట్

భర్తకు 20కోట్ల బంగ్లా.. నయన్ స్పెషల్ గిఫ్ట్

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్న హీరోయిన్ నయనతార. 2015 లో దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో పడింది ఈ భామ. తాజాగా వారి వివాహం మహాబలిపురంలో ఘనంగా జరిగింది. వివాహంతో ఒక్కటైన తరువాత విఘ్నేశ్ కు అత్యంత ఖరీదైన కానుక ఇచ్చింది నయనతార.

మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం భర్త విఘ్నేశ్ శివన్ కు దాదాపు రూ. 20 కోట్ల విలువ చేసే పెద్ద బంగ్లాను బహుమతిగా ఇచ్చింది నయన్. ఆ బంగ్లాను భర్త పేరుపై రిజిస్టర్ చేయించిందట. దీనితో పాటు మరదలు ఐశ్వర్యకు కూడా ఖరీదైన బంగారు ఆభరణాలు కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక దగ్గరి బంధువులకు కూడా విలువైన వస్తువుల్ని అందించింది.

విఘ్నేశ్ శివన్ సైతం నయన్ ను చాలా స్పెషల్ గా భావించాడు. అందుకు తగ్గట్లుగానే వివాహంలో కోట్లు విలువ చేసే డైమండ్ ఉంగరంతో పాటు బంగారాన్ని నయన్ కు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. నయన్ – విఘ్నేశ్ ల ప్రేమ గురించి గత కొన్నేళ్ళగా మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇన్నేళ్ళకు తమ ప్రేమను వివాహంతో పరిపూర్ణం చేసుకుంది ఈ జంట.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet