Idream media
Idream media
 
        
సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సోమవారం సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా సీఎం జగన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన వాటిని ఆర్బీకే(రైతు భరోసా కేంద్రం)ల ద్వారా అందిస్తున్నామని చెప్పారు ప్రకృతి వ్యవసాయంపై మరింత పరిశోధన జరగాలని అభిలషించారు. నేచురల్ వ్యవసాయం కోసం కేంద్రం 90:10 నిష్పత్తిలో నిధులివ్వాలని కోరారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆర్బీకేలపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ కె భేరి ప్రశంసలు కురిపించారు. ఆర్బీకేలు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.
