iDreamPost
android-app
ios-app

పవిత్ర బంధాన్ని అధికారికం చేసిన నరేష్

  • Published Dec 31, 2022 | 2:53 PM Updated Updated Dec 31, 2022 | 2:53 PM
  • Published Dec 31, 2022 | 2:53 PMUpdated Dec 31, 2022 | 2:53 PM
పవిత్ర బంధాన్ని అధికారికం చేసిన నరేష్

రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవడం లోకంలో వింత కాదు కొత్త అంతకంటే కాదు. మాములుగా అదసలు న్యూసే కాదు. కానీ సెలబ్రిటీల విషయంలో అలా ఉండదుగా. సీనియర్ నటుడు నరేష్ గత కొంత కాలంగా నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్న సంగతి ఓపెన్ సీక్రెట్. దీని మీద పెద్ద రచ్చ జరిగింది. మాజీ భార్య హోటల్ రూమ్ దాకా వెళ్లి మీడియా సాక్షిగా ఇద్దరినీ పట్టేసుకోవడం రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. గత కొన్నేళ్లుగా వీళ్ళ బంధం కొనసాగుతున్నా బయట ఈవెంట్లకు ఇద్దరూ కలిసి వస్తున్నా ఏనాడూ పబ్లిక్ గా మీడియాముఖంగా ఎస్ చెప్పలేదు. ఇటీవలే వివాదం మరీ ముదిరాక అవును మేము కలిసి ఉన్నామని ఓపెన్ అయ్యారు.

ఫైనల్ గా కొత్త సంవత్సరం సందర్భాన్ని పురస్కరించుకుని తమ అనుబంధం ఇక శాశ్వితమని చెప్పేందుకు నరేష్ ఒక వీడియో ట్వీట్ చేశారు. మాములుగా మేము వివాహం చేసుకోబోతున్నామని చెబితే కిక్ ఏముంటుంది. జనం కూడా పెద్దగా పట్టించుకోరు. అందుకే గీతాంజలిలో నాగార్జున అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండలా తన కాబోయే జీవిత భాగస్వామికి లిప్ లాక్ కిస్సు ఇచ్చే దృశ్యాన్ని వీడియో తీయించి మరీ తమ రిలేషన్ ఎంత బలమైందో చెప్పేశాడు. ఇప్పుడిది ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. బోలెడు మీమ్ ట్రోల్స్ జరుగుతున్నాయి. లేట్ వయసులోనూ ఇంత ఘాటు రొమాన్స్ అది కూడా అందరికీ చెప్పడం ఒక్క నరేష్ వల్లే సాధ్యమేమో

సో చిట్టచివరికి ఈ లేట్ ఏజ్ లవ్ స్టోరీ సుఖంతమైపోయింది. నరేష్ ప్రస్తుతం హయ్యెస్ట్ డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరు. పవిత్ర కూడా రెగ్యులర్ గా కనిపించేది కానీ ఈ గొడవ తర్వాత అవకాశాలు తగ్గిన మాట వాస్తవం. ఆ మధ్య రామారావు ఆన్ డ్యూటీ లాంటి సినిమాల్లో ఇద్దరూ కనిపిస్తే జనాలు ఈలలు వేసి గోల చేశారు. ఆ రేంజ్ లో వీళ్ళ వ్యవహారం పబ్లిక్ అయ్యింది. అయినా గుట్టుగా చేసుకుని చెప్పేది పోయి ఇలా దీనికి కూడా సినిమాటిక్ స్టైల్ లో చుంబనాలు చేసుకుంటూ చెప్పాలా అని విమర్శలు చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. సినిమావాళ్ళం కదా ఏది చేసినా ఆ రేంజ్ లో ఉంటుందని నరేష్ తిరిగి సమాధానం చెబితే ఎవరు మాత్రం ఏం చేయగలరు

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet