iDreamPost
iDreamPost
విశాఖపట్నం లో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాద ఘటనపై పీపుల్స్ స్టార్ అర్. నారాయణ మూర్తి స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోని విడుదల చేశారు. విశాఖ పట్నంలో జరిగిన ఎల్ జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుండి విష వాయువు లీక్ అయి 11 మంది చనిపోవడం వందలాది మంది హాస్పిటల్ పాలవ్వడం మూగ జీవాలు చనిపొవడం చాలా బాధ కలించే విషయం అని , ఒక రకంగా చెప్పాలి అంటే, ఒక పక్కన భారత దేశం నేడు కరోనా మహమ్మారితో అల్లాడుతున్న ఈ సమయంలో ఉత్తరాంధ్రలో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం అని అన్నారు.
భారత దేశంలో పి.వి నరసింహారావు గారు ప్రధానిగా, మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ వాణిజ్య సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల వలన జరిగిన దుష్పరిణామాల్లో ఇదొకటని ఏ బహుళజాతి కంపెనీలను ఏ కార్పొరేట్ శక్తులని మన భారత దేశంలో అభివృద్ది పేరు చెప్పి ఇలా ఆహ్వానిస్తున్నామో ఆ అనర్ధమే నేడు మనం ఎదుర్కుంటున్నాం అని చెప్పుకొచ్చారు.
Also Read : ‘జయహో వైజాగ్’ : ది బ్రేవ్ సిటీ
నాగవళి , వంశధార , తాండవ లాంటి అనేక నదులతో పచ్చగా ఉండే ఉత్తరాంధ్ర కరోనా లాంటి మహమ్మారికి కూడా తక్కువ ప్రభావితం అయిందని కానీ ఇలాంటి సంస్థల వలన మాత్రం దుష్పరిణామాలు ఎదుర్కుంటుందని, తక్షణం ఆ దక్షిణ కొరియా సంస్థని రద్దు చేయాలని , అలాగే జరిగిన ప్రాణ నష్టానికి , పంట నష్టానికి ఆ సంస్థ నుండి లక్షలాది కోట్లు వసూలు చేసి వారికి శిక్ష పడేలా చేయాలని ప్రధానమంత్రి మోడి గారిని కోరుతునట్టు చెప్పుకొచ్చారు.
అలాగే ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపొయిన తరువాత ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయిందని, ఆ డ్యామేజీలో భాగంగానే శ్రీ కృష్ణ , శివరామకృష్ణా కమిటీలు రెండు కూడా రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, ఆ రెండు ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి అని చెప్పినా ఇవ్వలేదని, ఇవేమి లేకపొయినా ఎన్నిక సమయంలో వై.యస్ జగన్ గారు ఏవైతే నవరత్నాల పేరున హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేస్తున్నారని , అలాగే కరోనా మహమ్మారిని తట్టుకుని , ఎదుర్కుని రాష్ట్రానికి ది బెస్ట్ ఏం చెయాలో అది చేస్తున్నారని , ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆర్ధిక నిధులు ఉన్నాయ లేవా అని ఆలోచించకుండా గ్యాస్ లీకేజి కారణాంగా చనిపొయిన వారికి కోటి రూపాయలు , వెంటిలేటర్ పై ఉండేవాళ్ళకి 10 లక్షలు, ఇబ్బందులు ఎదుర్కున్న వారికి 10వేలు చనిపొయిన పశువులకు కూడా 25వేలు ఇస్తూ ఆయన చూపిస్తున్న మానవీయ కోణంకి సెల్యుట్ చేస్తున్నాని చెప్పుకొచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీ ప్రకారం ఉత్తరాంధ్రకు ప్రత్యక ప్యాకేజీ ఇవ్వలేదని ఇప్పుడైన జాతీయ విపత్తు నుంచి నిధులు మంజూరు చేసి ముఖ్యమంత్రి జగన్ గారికి ఈ సమయంలో చేయూత ఇవ్వాలని ప్రధానిని తాను కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు.
Also Read : అందరి నోళ్లూ బంద్!