ప్రెస్‌మీట్‌ పెడతా.. నారా లోకేష్‌ వార్నింగ్‌

అధికారంలో లేకపోయినా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌కు చిక్కులు తప్పడంలేదు. ఆయన పేరుతో వస్తున్న ఫేక్‌ ట్వీట్లు లోకేష్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. చివరకు ఆయనే రంగంలోకి దిగి అవన్నీ ఫేక్‌ అంటూ చెప్పుకోవాల్సి వస్తోంది. అందుకే లోకేష్‌కు కోపం నషాలానికి అంటినట్లుంది. వైసీపీ సోషల్‌ మీడియాకు ప్రెస్‌మీట్‌ పెడతానంటూ గట్టి వార్నింగ్‌ ఇచ్చారు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రస్తుతం దేశం అల్లకల్లోలంగా మారింది. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని కొందరు నారా లోకేష్‌ను టార్గెట్‌ చేసి ఆయన పేరుతో ఫేక్‌ ట్వీట్లు చేశారు.

పార్టీ కార్యకర్తలు మరియు సామాన్య ప్రజలు కరోనా బారిన పడకుండా వారి రక్షణ కోసం లక్షల కోద్దీ మాస్కులు మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు అందుబాటులో ఉంచడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నా మనవి.. అంటూ ఓ ట్వీట్‌ నారా లోకేష్‌ పేరుతో వైరస్‌ అవుతోంది.

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న మహమ్మరి ‘కరోనా వైరస్‌’ని అరికట్టడంలో తుగ్లక్‌రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. దీనికి నిరసనగా మార్చి 26 గురువారం రోజున లక్ష మందితో శాంతియుత నిరసన ర్యాలీ చేయాలని నిర్ణయించుకున్నాను. కావున ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని పారాసిటమాల్‌ రెడ్డి గారికి మన నిరసన తెలిసేలా చేద్దాం.. అంటూ మరో ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరస్‌ అవుతోంది.

పై రెండు ట్వీట్లపై స్పందించిన లోకేష్‌ అవి ఫేక్‌ అని తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. అవి వైసీపీ సోషల్‌ మీడియా వాళ్లు చేశారనే భావనతో వారిపై ఫైర్‌ అయ్యారు. నన్ను బద్నాం చేయడానికి మార్ఫింగ్‌ ట్వీట్లు తయారు చేయాలి. మీ వాడు బద్నాం అవ్వాలి అంటే ప్రెస్‌మీట్‌ పెడితే చాలు. 5 రూపాయలు వేస్తే చాలు కరోనాను వదలదు వైఎస్‌ జగన్‌ గారి ఐదు రూపాయల పే టీఎం బ్యాచ్‌.. అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో కూడా ఇలానే లోకేష్‌ పేరుతో ఫేక్‌ ట్వీట్లు రాగా.. ఇలానే లోకేష్‌ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

Show comments