వైద్య చరిత్రలో ఎన్నో అరుదైన ఘటనలు జరిగాయి. కొన్ని మాములుగా అనిపించినా, మరికొన్ని మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఆడవారు గర్భిణీలు కావడం చూశాము, కానీ పురుషులు గర్భం దాల్చడం చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఇంతకు మించి అరుదైన ఘటన నాగ్ పూర్ లో చోటుచేసుకుంది. బానెడు పొట్ట వేసుకున్న ఓ వ్యక్తి.. తనకు సాధారణ పొట్టేనని భావించి తిరుగుతున్నాడు. అందరు అతడు కడుపుతో ఉన్నాడంటూ హేళన చేశారు. చివరకు అతడు వైద్య పరీక్షలు చేయించుకోగా.. షాకింగ్ విషయం తెలిసింది. అతడి కడుపుతో ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ‘ది డైలీ స్టార్’ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం..
మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన సంజు భగత్ భారీ పొట్ట వేసుకుని తిరుగుతున్నాడు. అతడి చూసి కడుపుతో ఉన్నావు అంటూ స్థానికులు ఎగతాళి చేసేవారు. అలా దాదాపు మూడు దశాబ్ధాల నుంచి సంజు పొట్ట అలానే ఉంది. ఎంతమంది ఎగతాళి చేసిన పట్టించుకోకుండా కాయకష్టం చేసుకుంటూ కుటుంబాన్ని పొషించే వాడు. అయితే కాలం గడిచే కొద్ది అతడి పొట్ట మరింత ఉబ్బెత్తుగా మారి కనిపిస్తుంది. అంతేకాక సంజు భగత్ కు శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా మారింది. దీంతో 1999లో ముంబైలోని ఓ ఆస్పత్రికి వెళ్లి.. వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అతడిని పరీక్షించిన వైద్యులు.. కడుపులో గడ్డ పెరిగినట్లు గుర్తించారు.
ఆపరేషన్ ప్రారంభించిన కాసేపటికి అది భారీ క్యాన్సర్ కావచ్చని అనుకున్నారు. పొట్టలో ఉన్నది చూశాక వైద్యుల నోట మాట రాలేదు. ఆ ఆపరేషన్ లో సంజు కడుపులో మనిషి అవయవాలు ఒకొక్కటిగా బయటకు రావడం మొదలు పెట్టాయి. నాటి అనుభవాన్ని డాక్టర్ అజయ్ మెహతా గుర్తు చేసుకున్నారు. 36 ఏళ్లుగా కవల సోదరుల పిండం సంజు భగత్ లో ఉన్నట్లు గుర్తించారు. దీనిని వైద్య భాషలో ఫీటస్ ఇన్ ఫీటు అంటారని వైద్యులు తెలిపారు. ఇది చాలా అరుదైన ఘటన అని డాక్టర్లు అన్నారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసన్ ప్రకారం.. ఇటువంటి కేసులు వందకు లోపే ఉంటాయి. సంజు భగత్ కి ప్రస్తుతం 60 ఏళ్ల కాగా, అతడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఈ వార్త తెలిసిన చాలా మంది.. ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.