iDreamPost
android-app
ios-app

నాగార్జున ఘోస్ట్ కు కొత్త సవాళ్లు

  • Published Sep 29, 2022 | 5:07 PM Updated Updated Dec 07, 2023 | 11:31 AM

ట్రైలర్ ని ముందుగా రిలీజ్ చేయడం చాలా ప్లస్ అయ్యింది.

ట్రైలర్ ని ముందుగా రిలీజ్ చేయడం చాలా ప్లస్ అయ్యింది.

నాగార్జున ఘోస్ట్ కు కొత్త సవాళ్లు

మొన్నటి దాకా గాడ్ ఫాదర్ ప్రమోషన్లు స్లోగా ఉండటంతో అక్టోబర్ 5నే విడుదలవుతున్న మరో పెద్ద సినిమా ది ఘోస్ట్ పైనే కొంచెం ఎక్కువ ఎడ్జ్ నడిచింది. ట్రైలర్ ని ముందుగా రిలీజ్ చేయడం చాలా ప్లస్ అయ్యింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా కర్నూలులో చేసినప్పటికీ అదే రోజు ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ దెబ్బకు అంతగా ఆడియన్స్ కి రీచ్ కాలేకపోయింది. నాగార్జున అఖిల్ నాగ చైతన్యల అరుదైన కలయిక స్టేజి మీద జరిగినప్పటికీ హాట్ టాపిక్ అవ్వలేదు. తాజాగా గాడ్ గాదర్ ట్రైలర్ వచ్చాక అంచనాలు మారిపోయాయి. ఏముంటుందిలే నుంచి ఏదో ఉందనే అభిప్రాయం జనంలో మొదలయ్యింది.

మాస్ కి నచ్చేలా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ని సెట్ చేసుకుని దాని మెగాస్టార్ స్టైలిష్ మ్యానరిజంస్ ని సెట్ చేసిన తీరు హైప్ ని పెంచిన మాట వాస్తవం. ఇప్పుడు ఘోస్ట్ కు ధీటైన పోటీ సిద్ధమైనట్టే. పైగా థియేటర్ కౌంట్ కూడా మెగా మూవీకి గట్టిగా దొరికేలా ఉంది. హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ సుదర్శన్ 35ఎంఎంతో పాటు ప్రధాన కేంద్రాల్లోని కీలక స్క్రీన్లు దీనికి ఇవ్వబోతున్నారు. ఘోస్ట్ నిర్మాత ఏషియన్ ఫిలింస్ కావడంతో ఇబ్బందేమీ లేదు కానీ చిరుని ఫేస్ చేయాలంటే మాత్రం దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఎక్స్ ట్రాడినరీ కంటెంట్ ని డిజైన్ చేసి ఉండాలి. ఒకవేళ గాడ్ ఫాదర్ కొంచెం అటుఇటు అయినా అది రివర్స్ లో కింగ్ కు ఎంతో మేలు చేస్తుంది.
New challenges for Nagarjuna Ghost
పరస్పరం రెండు హిట్ కావాలని కోరుకుంటున్న ఇద్దరు మిత్రుల అభిమానులు మాత్రం ఈ వార్ పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మాములుగా చిరంజీవి బాలకృష్ణలు తలపడటం చాలా సార్లు జరిగింది కానీ కొణిదెల అక్కినేని క్లాష్ మాత్రం పెద్దగా జరిగిన దాఖలాలు లేవు. అలా జరగకుండా చూసుకున్నారు కానీ ఈసారి మాత్రం తప్పలేదు. ఎక్కువ సెలవులను క్యాష్ చేసుకునే ఉద్దేశంతో గాడ్ ఫాదర్ టీమ్ ఆఘమేఘాల మీద పోస్ట్ ప్రొడక్షన్, ఆర్ఆర్, సెన్సార్ తదితర కార్యక్రమాలను పూర్తి చేసింది. దుబాయ్ లో ఓ ఈవెంట్ చేసే ఆలోచనలో ఉన్నారు కానీ అదెంత వరకు సాధ్యమో చూడాలి. మొత్తానికి గాడ్ ఫాదర్ ఘోస్ట్ లు కలిసి విజయం సాధిస్తారా చూడాలి