iDreamPost
iDreamPost
నిన్న మాదాపూర్ పోలీసులు మంచిరేవుల ఫామ్ హౌస్ మీద స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టుకున్న సుమంత్ చౌదరి నడిపిస్తున్న పేకాట బృందం ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇది ప్రస్తుతం నాగ శౌర్య కుటుంబం లీజులో ఉందని న్యూస్ ఛానల్స్ లో పదే పదే చూపించడంతో సోషల్ మీడియాలో అతనే ఇదంతా ప్రోత్సహించినట్టుగా ప్రచారం జరిగింది. అయితే లోగుట్టు చాలా ఉందని తెలిసింది. అవేంటో చూద్దాం. నాగ శౌర్య తండ్రి బాబాయ్ లు కలిసి ఈ ఫార్మ్ హౌస్ ని తమ రియల్ ఎస్టేట్ వ్యవహారాల కోసం ఆరు నెలల క్రితం ఓ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర లీజుకు తీసుకున్నారట. అవసరమైనప్పుడు ఇందులో సినిమాల తాలూకు చర్చలు కూడా జరిపేవారని తెలిసింది.
కానీ గత రెండు నెలలుగా శౌర్య కుటుంబం దాని మీద పెద్ద ఫోకస్ పెట్టలేదు. షూటింగులు రిలీజులు ఈవెంట్లతో బిజీగా ఉన్న యువ హీరో దాన్ని లైట్ తీసుకున్నారు. దీంతో ఓ పార్టీ కోసం ఆ భవనం కావాలని ఓనర్ స్నేహితుడు అడగటంతో ఆయనకి ఇచ్చేశారట. సాగర్ అనే వ్యక్తి ఇదంతా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. బర్త్ డే వేడుక అని చెప్పి భారీ ఎత్తున పేకాట మొదలుపెట్టారు. లొకేషన్లను మిత్రులకు పంపే క్రమంలో అది కాస్తా పెద్ద తలకాయల నుంచి పోలీసులకు వెళ్లిపోయింది. ఇక్కడ ఓ న్యూస్ ఛానల్ కీలకంగా వ్యవహరించిందని వినికిడి. పక్కా ప్లాన్ ప్రకారం అక్కడికి వెళ్లి దాడి చేసిన పోలీసులకు అందరూ దొరికిపోయారు
పాతిక మందికి పైగా ఆడుతున్న వాళ్ళు, 25 లక్షల నగదు రెడ్ హ్యాండెడ్ గా దొరికాయి. మొబైల్ ఫోన్లు, స్వైపింగ్ మెషీన్లు, అక్కడున్న ఎక్విప్మెంట్ అంతా సీజ్ చేశారు. అక్కడ నాగ శౌర్య కానీ ఆతని తరఫున వాళ్ళు కానీ లేకపోయినా ఇదంతా తనే చేశాడనే రేంజ్ లో రాత్రి ప్రచారం జరగడంతో అభిమానులు సైతం ఆందోళనకు గురయ్యారు. ఇక్కడ చెప్పిన విషయాల్లో ఎంత వరకు నిజముందో పోలీసులు విచారణ చేశాక క్లారిటీ వస్తుంది. ఇటీవలే రిలీజైన వరుడు కావలెను సినిమా తాలూకు ప్రమోషన్లు పనుల్లో బిజీగా ఉన్న నాగ శౌర్యకు ఇదంతా అనుకోకుండా వచ్చిన తలనెప్పి. అధికారికంగా తను కానీ డిపార్ట్మెంట్ కానీ క్లారిటీ ఇస్తే కానీ ఈ రచ్చ ఆగదు
Also Read : Pawan Kalyan Rajamouli : దారులు వేరయ్యాయి.. పవన్ తో సినిమా గురించి జక్కన్న ఆసక్తికర స్పందన