Arjun Suravaram
Naa Anveshana Youtuber Anvesh: తెలుగు వారికి నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఏదో ఒక ప్రదేశానికి సంబంధించి వీడియోలు పెడుతుంటారు. తాజాగా ఓ షాకింగ్ వీడియోను పోస్టు చేశాడు.
Naa Anveshana Youtuber Anvesh: తెలుగు వారికి నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఏదో ఒక ప్రదేశానికి సంబంధించి వీడియోలు పెడుతుంటారు. తాజాగా ఓ షాకింగ్ వీడియోను పోస్టు చేశాడు.
Arjun Suravaram
ప్రస్తుతం అందరూ యూట్యూబ్ వీడియోలు చూడటానికి బాగా అలవాటు పడిపోయారు. యూట్యూబ్ అనగానే ఎంతో మంది గుర్తుకు వస్తారు. అయితే యూట్యూబ్ అనగానే తెలుగు వారికి ఒకరి పేరు మాత్రం ఠక్కున గుర్తొస్తుంది. అదే నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్. కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లకు సుపరిచితుడు అయిపోయాడు. అతని వీడియో వచ్చిన గంటల్లోనే ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటుంది. యూట్యూబ్ ద్వారా లక్షలు సంపాదించి చూపించాడు. నెలకు రూ.30 లక్షల చొప్పున ఆదాయం పొంది యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేశాడు. అలాంటి అన్వేష్ ..తాజాగా తనకు రూ.40 లక్షలు నష్టం వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు. అసలు ఏం జరిగిందో..నష్టం ఎలా వచ్చిందో ఓ వీడియో లో వివరించాడు.
ఇక తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో అన్వేష్ అనేక విషయాలను ప్రస్తావించారు. అతడు మాట్లాడుతూ…”గతంలో ఇదే సమాయానికి 30 లక్షలు, 60 లక్షలు, కోటి రూపాయలు లాభం వచ్చినప్పుడు అందరూ అన్వేష్ సూపర్ అన్నారు. అయితే ఈ సారి మాత్రం రూ.40 లక్షలు నష్టం వచ్చింది. ఇక్కడ ఎవరి తప్పులేదు. నాకు నేను చేసుకున్న నష్టం. నాకు ఎలా నష్టం వచ్చిందో తెలుసుకుంటే..మీరు ఆశ్చర్యానికి గురవుతారు. నేను న్యాయంగా, ధర్మంగా ఉండటం వల్లనే ఈ నష్టం జరిగింది.
నేను జనవరి నుంచి రెగ్యూలర్ గా పెట్టడం మానేశాను. అయితే నాకు ఎక్కువగా యూరప్ టూర్ లోనే నష్టం జరిగింది. నాకు ముందే తెలుసు నష్టం జరుగుతుందని తెలుసు. మీరు నాపై పెట్టుకున్న నమ్మకానికి.. ఎవరు చూపించలేని యూరప్ లో ఉన్న ఉత్తర ధృవం వంటి ప్రదేశాలను కూడా చూపించాలని అనుకున్నాను. అలాంటి ప్రదేశాలకు యాత్రలు చేయాలంటే.. ఖర్చుతో కూడుకున్నదే. అయినా ఇలాంటి అరుదైనా, ఖరీదైన ప్రదేశాలను ఎవరు చూపిస్తారంటే..మీకు అన్వేష్ గుర్తుకు వస్తాడు. అందుకే కచ్చితంగా చూపించాలని అనుకున్నాను. ప్రపంచ యాత్రికుడు అని బిరుదు ఇచ్చినందకు.. దానిని సార్థకం చేసుకునేందుకు ఖరీదైనా యాత్రలు చేపట్టాను. లాభాలు వచ్చినప్పుడు మీతో పంచుకున్నట్లే..అలానే నష్టాలు వచ్చినప్పుడు.. ఆ విషయాలను కూడా మీతో షేర్ చేసుకుంటాను. అదే విధంగా ఈ సారి యూరప్ ట్రిప్ లో 40 లక్ష వరకు నష్టం వచ్చింది.
అందుకు కారణం.. ఇక్కడ ప్రతి వస్తువు రేటు భారీగా ఉంటుంది. రెండు లీటర్ల నీరు కొనాలి అంటే 2 వేలు అవుతోంది. అలానే కాఫీ 500 వందలు అవుతుంది. అలానే రూమ్ రెంట్ కూడా భారీగానే ఉంటుంది. ఇలా 90 రోజుల పాటు.. ఇక్కడే ఉండి అనేక ప్రదేశాలను చూపించాను. చాలా రోజులు ఉన్నప్పటికీ తీసిన వీడియోలు 15 మాత్రమే. వీటిల్లో కొన్ని వీడియోలు బాగానే క్లిక్ అయ్యాయి. అయితే యూరప్ ట్రిప్ వీడియోలు నష్టం రావడానికి కారణం.. చాలా మంది సినిమాల్లో ఎక్కువగా ఈ ప్రదేశాలను చూశారు. చాలా సినిమాల్లో యూరప్ దేశాలు కనిపిస్తూనే ఉంటాయి.
ఈ క్రమంలోనే మనం చేసిన యూరప్ ట్రిప్ వీడియోలు లాభాలు తీసుకురాలేకపోయాయి. ఖర్చులు ఎక్కువ అయ్యవడంతో లక్షల్లో నష్టం వచ్చింది. అయితే ఎవరు కంగారు పడకండి.. రూ.40 లక్షల్లో నుంచి రూ.10 లక్షలు వెనక్కి వస్తాయి. కొన్ని ప్రభుత్వం దగ్గర ఉంటాయి..వాటిని వెనక్కి తీసుకుంటే.. నష్టం తగ్గుతుంది. అయితే ఎవరు కూడా అప్పులు చేసి ట్రావెలింగ్ చేయవద్దు అని మాత్రం చెబుతాను” అంటూ నా అన్వేషణ యూట్యూబర్ తనకు వచ్చిన నష్టం గురించి విషయాలను షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. అన్వేష్ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.