Tirupathi Rao
Naa Anveshana Youtuber Anvesh: యూట్యూబ్ లో అన్వేష్ కు లక్షల్లో సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్లందరికీ అన్వేష్ షాకిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు.
Naa Anveshana Youtuber Anvesh: యూట్యూబ్ లో అన్వేష్ కు లక్షల్లో సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్లందరికీ అన్వేష్ షాకిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు.
Tirupathi Rao
ప్రస్తుతం అందరూ యూట్యూబ్ వీడియోలు చూడటానికి ఎంతగానో అలవాటు పడిపోయారు. యూట్యూబ్ అనగానే తెలుగు వారికి ఒక పేరు మాత్రం టక్కున గుర్తొస్తుంది. అదే నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్. కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సుపరిచితుడు అయిపోయాడు. అతని వీడియో వచ్చిన గంటల్లోనే ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటుంది. యూట్యూబ్ ద్వారా లక్షలు సంపాదించి చూపించాడు. నెలకు రూ.30 లక్షల చొప్పున ఆదాయం పొంది యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేశాడు. అలాంటి అన్వేష్ వీడియోలు ఆపేస్తున్నానంటూ చెప్పడంతో ఫ్యాన్స్ అంతా షాక్ కు గురవుతున్నారు.
కరోనా వల్ల ఉద్యోగం పోవడంతో అన్వేష్ యూట్యూబ్ వైపు మళ్లాడు. ముందుగా భారతదేశంలో ఉన్న ముఖ్యమైన, చూడదగిన ప్రదేశాలను ఎక్స్ ప్లోర్ చేశాడు. ఆ తర్వాత ప్రపంచ దేశాలను సందర్శించడం మొదలు పెట్టాడు. తన కళ్లతో ప్రపంచాన్ని సబ్ స్క్రైబర్లకు చూపిస్తానని చెబుతూ ఉంటాడు. యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన కొద్ది నెలల్లోనే అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. తన మాట, చూపించే ప్రదేశాలు, వివరించే విషయాలకు అందరూ ఫ్యాన్స్ అవ్వడం మొదలు పెట్టారు. ప్రస్తుతం అతని యూట్యూబ్ ఛానల్ కు 1.92 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. అతని పేరిట పదుల సంఖ్యలో ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, సోషల్ మీడియా పేజెస్ ఉన్నాయి. అన్వేష్ చేసిన కంటెంట్ ని వాడుకుంటూ వీళ్లు కూడా బాగానే సంపాదిస్తున్నారు.
దేశాలను తిరగడం మాత్రమే కాకుండా మన దేశం ఎందులో గొప్ప, ఎక్కడ వెనుకబడి ఉంది, ఏం మార్చుకుంటే మెరుగవుతుంది అనే విషయాలపై తన అభిప్రాయాలను చాలా ఓపెన్ గా చెబుతూ ఉంటాడు. అలా చెప్పడం వల్ల చాలాసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు. అత్యంత తక్కువ ఖర్చులో దేశాలను ఎలా తిరగచ్చు అనే విషయాన్ని వెల్లడిస్తూ ఉంటాడు. ఇలా తన మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పే క్రమంలోనే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాని చెప్పాడు. చివరకి తాను యూట్యూబ్ ఆపేస్తున్నాను అంటూ తాజాగా వీడియో చేసి పెట్టాడు. మొత్తం 44 నిమిషాల వీడియోలో తాను అనుకుంటున్న, తనకు ఎదురవుతున్న సమస్యలు, సవాళ్ల గురించి వివరించాడు. అవన్నీ విన్న తర్వాత సబ్ స్క్రైబర్స్, ఫ్యాన్స్ కూడా తమ అభిప్రాయాలను వెల్లడించాలంటూ చెప్పుకొచ్చాడు.
ఆ వీడియోలో తనకు కంపెనీలు, తోటి యూట్యూబర్స్, మీడియా, రాజకీయ నాయకుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పాడు. అలాగే తన ఆరోగ్యం కూడా దెబ్బ తిందని.. అనేక హెల్త్ ఇష్యూస్ తో సతమతమవుతున్నట్లు వెల్లడించాడు. ఆ వీడియోకి పిన్డ్ కామెంట్ లో.. “ఈ 4 సంవత్సరాలు నన్ను ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరునా కృతజ్ఞుడిని, ఎన్నో మంచి మంచి వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. 1200పైగా ట్రావెలింగ్ వీడియోలు మన ఛానల్ లో ఉన్నాయి. అవన్నీ మీరు చూస్తారని కోరుకుంటున్నాను. మంచి వీడియోలు తీయడానికి నాకు తగినంత సమయం సరిపోవట్లేదు, ఇన్నాళ్లు వృత్తి ధర్మానికి కట్టుబడి వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయాను, త్వరలో మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను” అంటూ అన్వేష్ చెప్పుకొచ్చాడు. మరి.. నా అన్వేషణ అన్వేష్ యూట్యూబ్ వీడియోలు ఆపేయాలా? కొనసాగించాలా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.