Dharani
కేంద్ర ప్రభుత్వం ఓ సూపర్ ఆఫర్ ప్రకటించింది. దీనిలో ఓ భాగంగా మీరు ఓ చిన్న పని చేస్తే చాలు.. కేంద్ర ప్రభుత్వం నేరుగా మీ ఖాతాలో రూ.30 వేలు జమ చేస్తుంది. ఎందుకు అంటే..
కేంద్ర ప్రభుత్వం ఓ సూపర్ ఆఫర్ ప్రకటించింది. దీనిలో ఓ భాగంగా మీరు ఓ చిన్న పని చేస్తే చాలు.. కేంద్ర ప్రభుత్వం నేరుగా మీ ఖాతాలో రూ.30 వేలు జమ చేస్తుంది. ఎందుకు అంటే..
Dharani
ఈ మధ్యకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తోన్న ఆర్ధిక సాయాన్ని.. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తున్నాయి. గతంలో అయితే సంక్షేమ పథకాలు, స్కాలర్‌షిప్‌లు వంటి వాటి కింద ఇచ్చే మొత్తాన్ని లబ్ధిదారుల చేతికి అందజేసేవారు. ఆసమయంలో కొందరు అధికారులు అవినీతికి పాల్పడేవారు. కానీ ఆన్‌లైన్ విధానం తెచ్చాక ఒక బటన్ నొక్కితే చాలు.. నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే నగదు జమ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక సూపర్ ప్రకటన చేసింది. నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో 30 వేలు జమ చేస్తానని పేర్కొంది. అయితే ఒక చిన్న పని చేయాలని సూచించింది. ఇంతకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నగదు జమ చేస్తోంది.. ఆ మొత్తం పొందాలంటే ఏం చేయాలి అంటే..
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖకు చెందని నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ తాజాగా మైగౌ భాగస్వామ్యంతో సూపర్ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఉమాంగ్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చి 6 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్ర సర్కార్ ఈ సూపర్ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. దీనిలో గెలిచిన వారికి ప్రైజ్ మనీగా 30 వేల రూపాయలు అందజేయనుంది. ఈ మొత్తాన్ని విజేతల ఖాతాలో జమ చేస్తారు. పోటీలో ఏం చేయాలి అంటే ఉమాంగ్ యాప్ ఉపయోగాలు వివరిస్తూ.. రీల్స్, పోస్టర్, ట్యాగ్‌లైన్ తయారు చేయాలి. ఒక్కో పోటీకి ఒక్కో రకంగా ప్రైజ్ మనీ అందజేస్తారు.
ఈ పోటీలో భాగంగా మీరు ఓ వీడియో తీయాలి. దీనిలో ఉమాంగ్ యాప్ వల్ల కలిగే లాభాలు, డిజిటల్ ఇండియా, ఉమాంగ్ యాప్ ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలు, ఉమాంగ్ వల్ల మీ జీవితంలో చొటు చేసుకున్న మార్పుల గురించి వివరిస్తూ.. ఆసక్తికరంగా.. ఆకట్టుకునేలా వీడియో తీయాల్సి ఉంటుంది. ఇక ఈ పోటీలో పాల్గొని విజేతగా నిలిచిన వారికి కేంద్ర ప్రభుత్వం భారీగా ప్రైజ్ మనీ అందిస్తుంది.
మొదటి స్థానంలో నిలిచిన విజేతకు రూ. 15 వేలు అందిస్తారు. అలానే సెకండ్ ప్లేస్‌లో ఉన్న వారికి రూ. 12 వేలు, మూడో స్థానంలో ఉన్న వారికి రూ.10 వేలు బహుమతి లభిస్తుంది. తర్వాత మరో ఏడుగురికి రూ. 2 వేలు చొప్పున ప్రోత్సాహక బహుమతి అందజేస్తారు. ఇక మీరు రూపొందించే వీడియో నిడివి 90 సెకన్లు ఉండాలి. ఈ పోటీలో పాల్గొనాలని భావించిన వారు.. డిసెంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు.
అలాగే ఉమాంగ్ యాప్‌కు సంబంధించి మరో పోటీ కూడా ఉంది. దీనిలో మీరు ఉమాంగ్ యాప్ గురించి అందంగా.. ఆకర్షణీయంగా ఒక పోస్టర్ తయారు చేయాలి. దీనిలో పాల్గొని విజయం సాధించిన వారికి మొదటి బహుమతి కింద రూ. 7,500 అందిస్తారు. రెండో స్థానంలో ఉంటే రూ. 5 వేలు.. థర్డ్ ప్లేస్‌లో ఉన్న వారికి రూ. 3500 ఇస్తారు. తర్వాతి 7 మందికి రూ. 1500 చొప్పున లభిస్తాయి. ఇక ఈ పోటీలో పాల్గొనేందుకు డిసెంబర్ 17 వరకు అవకాశం ఉంటుంది.
ఉమాంగ్ యాప్‌కు సంబంధించి వీడియో, పోస్టర్‌తో పాటు ట్యాగ్‌లైన్ రైటింగ్ పోటీ కూడా నిర్వహిస్తున్నారు. దీనిలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ. 7500, రెండో స్థానంలో ఉంటే రూ. 5 వేలు, మూడో స్థానంలో ఉంటే రూ. 3,500 అందజేస్తారు. వీరి తర్వాతి 7 మందికి రూ. 1500 చొప్పున ప్రోత్సాహక బహుమతి లభిస్తుంది. ట్యాగ్‌లైన్ 7 పదాల్లోనే ఉండాలి. హిందీ లేదా ఇంగ్లీష్‌లో ఉండొచ్చు. ఈ పోటీలో పాల్గొనేందుకు డిసెంబర్ 13 వరకు ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ మూడు పోటీల్లో విజేతగా నిలిస్తే.. మొత్తంగా 30 వేల రూపాయలు గెలుచుకునే అవకాశం ఉంది.