iDreamPost
android-app
ios-app

మార్చి 31లోపు ఈ పనులు చేయకపోతే.. భారీ మూల్యం తప్పదు

  • Published Mar 29, 2024 | 1:41 PM Updated Updated Mar 29, 2024 | 1:41 PM

మరి రెండు రోజుల్లో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగియబోతోంది. అలాగే ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే.. ఎన్నో పర్సవల్ ఫైనాన్స్ సంబంధించి డెడ్‌లైన్స్ ముగుస్తున్నాయి. కావున ఈ మార్చి 31లోపు పూర్తి చేయాల్సిన ఆ పథకాలు పనులేంటే తెలుకోని పూర్తి చేయకపోతే భారీ మూల్యం తప్పదు.

మరి రెండు రోజుల్లో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగియబోతోంది. అలాగే ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే.. ఎన్నో పర్సవల్ ఫైనాన్స్ సంబంధించి డెడ్‌లైన్స్ ముగుస్తున్నాయి. కావున ఈ మార్చి 31లోపు పూర్తి చేయాల్సిన ఆ పథకాలు పనులేంటే తెలుకోని పూర్తి చేయకపోతే భారీ మూల్యం తప్పదు.

  • Published Mar 29, 2024 | 1:41 PMUpdated Mar 29, 2024 | 1:41 PM
మార్చి 31లోపు ఈ పనులు చేయకపోతే.. భారీ మూల్యం తప్పదు

దేశంలో ప్రతి ఏడాది మార్చి నెలలో ఆర్థిక సంవత్సరం ముగిసి తిరిగి ఏప్రిల్ నెలకు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతందనే విషయం తెలిసిందే. అయితే ఈ కొత్త ఆర్థిక సంవత్సరంకు ముందు చేయావల్సిన కొన్ని ముఖ్యమైన పనులు చాలానే ఉంటాయి. అనగా ఆర్థిక సంబంధిత పనులు, పెండింగ్ లో ఉన్నవి వీలైనంత త్వరగా పూర్తి చేస్తే చాలా మంచింది. దీని వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాగా, ఎప్పటిలానే మరో రెండు రోజుల్లో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. కావున ఈ మార్చి 31లోపు పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మరి రెండు రోజుల్లో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగియబోతోంది. అలాగే ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే.. ఎన్నో పర్సవల్ ఫైనాన్స్ సంబంధించి డెడ్‌లైన్స్ ముగుస్తున్నాయి. ముఖ్యంగా వీటిలో అప్‌డేటెడ్ ఇన్‌కంటాక్స్ రిటర్న్స్.. టాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్, పీపీఎఫ్, అలాగే ఎన్‌పీఎస్ వంటి పథకాల్లో డిపాజిట్లు.. ఎస్‌బీఐ, ఐడీబీఐ స్పెషల్ స్కీమ్స్ వంటివి ఈనెల అనగా మార్చి 31లోపు తగిన సమాచారాలు ఇచ్చి పూర్తి చేయాలి. అలా చేసుకుంటే.. భవిష్యత్తులో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. మరి, ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన పనులు ఏవంటే..

మ్యూచువల్ ఫండ్లల్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారు రీకేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. కాగా, అందుకు సంబంధించిన ధ్రువీకరణలతో కేవైసీ నింబంధనల్ని పూర్తి చేయని వారు తగిన వివరాలు సమర్పించి వెంటనే వాటిని ఈ మార్చి 31లోపు పూర్తి చేయడం మంచింది.

అలాగే బ్యాంకుల్లో కూడా ఇప్పటి వరకు ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటివి లేకపోతే కేవైసీని అప్డేట్ చేయాల్సిందిగా సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే.. పలు బ్యాంకులకు సంబంధించి ఇప్పటికే కస్టమర్లకు మెయిల్, SMS ల ద్వారా సంబంధిత సందేశాలను పంపిస్తున్నాయి. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకులో కేవైసీ ఆప్ డేట్ మాత్రం మార్చి 19కే ముగిసింది.

ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ కస్టమర్ల కోసం ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తూ .. ఓ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ను ఎస్‌బీఐ అమృత్ కలశ్ ఎఫ్‌డీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కాగా, 0 రోజుల ఈ FD గడువు మార్చి 31నే ముగుస్తోంది. అప్పట్లోగా ఇందులో చేరాల్సి ఉంటుంది. దీని కింద రెగ్యులర్ సిటిజెన్లకు 7.10 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.60 శాతం వడ్డీ అందుతోంది.

దీనితో పాటు చాలామంది సొంతిల్లు కొనుగోలు చేయడం, నిర్మించుకోవాలనుకోవాలని అనుకుంటారు. అలాంటి వారికి చాలా బ్యాంకులు ప్రత్యేక రాయితీతో మార్చి 31 వరకు లోన్లు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో పాటు ఎస్‌బీఐ కూడా మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్న వారి కోసం గరిష్టంగా 65 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రాయితీ కల్పిస్తోంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజుల్లోనూ డిస్కౌంట్ ఇస్తున్నాయి.

అన్నిటికన్నా ముఖ్యమైనది ఆదాయపు పన్ను.కాగా, ఈ ఆదాయపు పన్ను రిటర్న్స్‌కు సంబంధించి అప్‌డేటెడ్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు కూడా ఈనెల అనగా మార్చి 31వ తేదీకి గడువు ముగుస్తుంది. కనుక ఇప్పటికే ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసులు వచ్చిన వారు వెంటనే ఈ పని పూర్తి చేయాలి. 2021-22, 2022-23, 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరాలకు సంబంధించి.. వీటిని దాఖలు చేయడానికి ఐటీ శాఖ అనుమతి ఇచ్చింది. వీటిని ఫైల్ చేసేటప్పుడు అదనంగా చెల్లించాల్సిన టాక్స్‌పై కొంత వడ్డీ చెల్లించాల్సివుంది.

ఇక పన్ను ఆదా పెట్టుబడులకు కూడా గడువు తేదీ కూడా మార్చి 31న ముగయనుంది. అయితే ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో పెట్టుబడులకు ఆఖరి తేదీ మార్చి 28తోనే ముగిసింది. పైగా శని, ఆదివారాలు స్టాక్ మార్కెట్‌కు సెలవు. ఇందుకోసం మార్చి 31న ఆదివారం అయినా ఈ డిపాజిట్లు చేసేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది .

ఇంకో రెండు రోజుల్లో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిస్తున్న నేపథ్యంలో ఈ మార్చి 31లోపు పూర్తి చేయాల్సిన పనులను ఇంక ఎవరైనా చేయకుండా ఉంటే.. తక్షణమే పూర్తి చేసేయండి. మరి, మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన పనులు, ముగుస్తున్న పథకాల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.