sai
sai
టాలీవుడ్ చిత్ర పరిశ్రమను కరోనా మహమ్మారి దడ పుట్టిస్తోంది . ఇప్పటికే చాలా మంది నటీనటులు కరోనా భారిన పడగా., తాజాగా నేడు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వయంగా ఆయన సోషల్ మీడియాలో ప్రకటించాడు. తనకు గత రెండు రోజుల నుంచి.. కరోనా లక్షణాలు ఉన్నాయని, అందుకే ఈరోజు కరోనా పరీక్షలు చేయించుకున్నానని, రిపోర్ట్స్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు.
ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు తమన్ తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా.. కరోనా పరీక్షలు చేయించుకొని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు తమన్. ఇక సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ, విశ్వక్ సేన్, అరుణ్ విజయ్, స్వర భాస్కర్, మీనా, వరలక్ష్మి శరత్ కుమార్ తదితర నటులు కరోనా భారిన పడ్డారు.
Also Read : Pushpa OTT : పుష్ప చూపిన దారి సరైనదేనా