Idream media
Idream media
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. ఐ. పోలవరం మండలం పాత ఇంజరం 216 జాతీయ రహదారిపై పొన్నాడ సతీష్ కుమారుడు సుమంత్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురయింది. పాత ఇంజరం 216 జాతీయ రహదారిపై పొన్నాడ సుమంత్ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఇక ఈ ప్రమాదంలో సతీష్ కుమార్ పెద్ద కుమారుడు సుమంత్, మేనల్లుడు లోకేష్ లకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను హైవే మొబైల్ పెట్రోలింగ్ సిబ్బంది గమనించి, వారిని యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యంకోసం యానాం నుంచి కాకినాడ తరలించినట్లు సమాచారం. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయం మీద పూర్తి సమాచారం అందాల్సి ఉంది. పొన్నాడ వెంకట సతీష్ కుమార్ 2009లో దివగంత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేపి టీడీపీ అభ్యర్థి నడింపల్లి శ్రీనివాసరాజుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అయితే రాష్ట్ర విభజన అనంతరం కాస్త రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన 2014 ఎన్నికలకు సైతం దూరంగా ఉన్నారు. ఆ తరువాత జగన్ వెంట నడిచిన ఆయన 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ క్రమంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన దాట్ల బుచ్చిబాబు మీద సుమారు ఆరువేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక పొన్నాడ సతీష్ కు ఇద్దరు కుమారులు కాగా అందులో పెద్ద కుమారుడు సుమంత్ కి ఇప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింది.