స్కూల్లో పిల్లలు అల్లరి చేయడం సర్వసాధారణం. అల్లరి చేయకుండా బాల్యాన్ని దాటిన వాళ్లు ఎవరూ ఉండరు. అదే రెసిడెన్షియల్ స్కూల్ అయితే.. పిల్లలు చేసే అల్లరి అలా ఇలా ఉండదు. స్కూల్లో ఉండగా చదువు, అల్లరి రెండూ ముఖ్యమే. కానీ, ఆ అల్లరికి ఒక హద్దు ఉండాలి. మనం ఏం చేస్తున్నాం అనే దానిపై ఒక సోయ ఉండాలి. కానీ, అది మరచి పనులు చేస్తే.. తర్వాత పర్యావసానాలు కూడా అందే దారుణంగా ఉంటాయి. అలా ఓ 9 మంది విద్యార్థులు చేసిన పని ఇప్పుడు వారికి పెద్ద సమస్యలే తెచ్చిపెట్టాయి.
స్కూలుకు వెళ్లిన వాళ్లు చదవుకోవాలి, గ్రౌండ్ లో ఆడుకోవాలి. కానీ, ఈ విద్యార్థులు అవన్నీ వదిలేసి పాఠశాలలో మందు కొట్టారు. అది గమనించి అలా చేయకండని వ్యాయామ ఉపాధ్యాయుడు మందలిస్తే.. తిరిగి ఆయన మీదే ఆ నందిను మోపారు. ఈ ఘటన ములుగు మండలం మంల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆలస్యంగా వెలుగు చూసింది. 9 మంది విద్యార్థులు పాఠశాలలో మద్యం సేవించారు. వారిలో ఏడుగురు 9వ తరగతి విద్యార్థులు కాగా ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఉన్నారు.
శనివారం రాత్రి మద్యం కొనుగోలు చేసి స్కూలుకి తీసుకెళ్లి తాగారు. ఆ విషయాన్ని గమనించిన వ్యాయామ ఉపాధ్యాయుడు వారిని మందలించి మళ్లీ అలా చేయకండని హెచ్చరించారు. వారితో మళ్లీ అలా చేయమంటూ ఒప్పంద పత్రం రాయించుకున్నారు. తెల్లారేసరికి ఆ విద్యార్థులు పాఠశాలలో లేరు. అంతా ఇంటికి వెళ్లిపోయారు. అక్కడితే ఆగకుండా ఉపాధ్యాయుడు మీదే తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడు. ఆయనే మద్యం సేవించి నింద వారిపై వేసినట్లు చెప్పారు. దాంతో తల్లిదండ్రులు అంతా పాఠశాలకు వెళ్లి వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగు చూసింది.
పాఠశాలలో విద్యార్థులు నిజంగానే మద్యం తాగారని తేలింది. ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి స్కూల్ కి రాలేదు. ఈ విషయంపై స్కూల్ ప్రిన్సిపాల్ స్పందించారు. విద్యార్థులు మద్యం సేవించిన విషయంపై విచారణ జరగడం వాస్తవమే తెలిపారు. అయితే ఇంకా విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మైనర్లకు మద్యం విక్రయించిన వైన్ షాప్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సమాచారాన్ని కమిషనర్ కు పంపారు. ఆయన ఆదేశాల మేరకు మద్యం దుకాణానికి జరిమానా విధిస్తామని చెప్పారు. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మద్యం తాగుతున్న 9వ తరగతి విద్యార్థులు
వరంగల్ – మల్లంపల్లిలోని తొమ్మిదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న తొమ్మిది మంది విద్యార్థులు మద్యం తాగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు.
21 ఏళ్లలోపు విద్యార్ధులకు మద్యం విక్రయించినందుకు శ్రీరామ వైన్స్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు. pic.twitter.com/X6z5wWR8jA
— Telugu Scribe (@TeluguScribe) July 13, 2023