iDreamPost
iDreamPost
ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం మారిపోయింది. నాలుగు పంచ్ డైలాగ్ లు, ఐదు ఫైట్ లు, ఆరు పాటలతో ఏదో తీసేస్తే చూసే రోజులు కావివి. హీరో, డైరెక్టర్ ఎవరన్నది కాదు.. కథాకథనాల్లో కొత్తదనం ఉండాలి.. అప్పుడే ప్రేక్షకులు చిత్రాలను ఆదరిస్తున్నారు. అందుకే యంగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అలా విభిన్న కథాంశంతో ప్రేక్షులముందుకు వచ్చిన చిత్రమే ముఖచిత్రం.
ముఖచిత్రం ట్రైలర్ చూసినప్పుడే ఈ సినిమా కాస్త కొత్తగా ఉండబోతుందని అర్థమైంది. సినిమా చూశాక అది నిజమనే అభిప్రాయం కలుగుతుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. కథలో కొత్తదనం ఉంది, అలాగే బలమైన సందేశం కూడా ఉంది. ప్లాస్టిక్ సర్జరీ కాన్సెప్ట్ ని తీసుకొని కథని నడిపించిన తీరు ఆకట్టుకుంది. కథనం చాలా ఆసక్తికరంగా సాగింది. ఫస్టాప్ లో పాత్రలను పరిచయం చేస్తూ సన్నివేశాలు జరుగుతున్న కొద్దీ తర్వాత ఏం జరగబోతుందోనన్న ఆసక్తి కలిగేలా చేశారు. సెకండాఫ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిచింది. సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు అయితే థ్రిల్ చేస్తాయి.
ఇక కోర్టు ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. లాయర్ గా ముఖ్యమైన పాత్రలో యువ సంచలనం విశ్వక్ సేన్ అదరగొట్టాడు. కోర్టు ఎపిసోడ్ లో విశ్వక్ సేన్, రవిశంకర్ మధ్య జరిగే పోటాపోటీ వాదన పవర్ ఫుల్ గా ఉంది. క్లైమాక్స్ డైలాగ్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా, హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో ప్రియా వడ్లమాని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమాకి కీలకమైన రెండు షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించింది.
కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి. సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశాయి. మొత్తానికి ముఖచిత్రం విభిన్న కథాంశంతో రూపొందిన ఆకట్టుకునే చిత్రం అని చెప్పొచ్చు.