iDreamPost
android-app
ios-app

బ్లూ ప్రింట్‌ తయారు చేద్దాం.. అధికారం సాధిద్దాం.. ముద్రగడ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభం

బ్లూ ప్రింట్‌ తయారు చేద్దాం.. అధికారం సాధిద్దాం.. ముద్రగడ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభం

కొన్ని రోజులుగా మాజీ మంత్రి, కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ సాగిన ఊహాగానాలు నిజమయ్యాయి. కాపులు రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలని, అడిగితే అది వచ్చేది కాదని, గుంజుకోవాలంటూ ముద్రగడ దళిత, బీసీ, కాపులను ఉద్దేశించి తాజాగా ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన తన వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. తక్కువ జనాభా కలిగిన వారు రాజ్యాధికారం ఎందుకు అనుభవించాలి, ఎక్కువ జనాభా కలిగిన మన జాతులు ఎందుకు అనుభవించకూడదో ఆలోచన చేయాలని ముద్రగడ ఆ లేఖలో కోరడంతో.. త్వరలో రాజకీయ పార్టీ ఏర్పాటు తథ్యమని తేలిపోయింది.

‘‘ మనం బానిసలం, మన దేశానికి స్వతంత్య్రం వచ్చినా.. మన జాతులకు రాలేదు. ఇంచుమించుగా వారే రాజ్యాధికారం అనుభవించారు.. అనుభవిస్తున్నారు. అధికారం గుంజుకోవాలే తప్పా.. బిక్షం వేయాలని అడిగినా వేయరు. మన జాతులు పల్లకీలు మోయడానికేనా..? పల్లకీలు మోసిన తర్వాత, అవసరం తీరాక పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు. ఎంత కాలం ఇలా పల్లకీలు మోయాలి..? ఆ పల్లకీలో కూర్చునే అవకాశం తెచ్చుకోలేమా..? మన జాతులను బజారులో కొనుగోలు చేసే వస్తువుగా చూస్తున్నారు. ఆ నింద పోగొట్టుకోవాలి. మార్పు కోసం ప్రయత్నం చేస్తే.. సాధించలేనిది ఏదీ లేదు.

వారు వారు చాలా ధనవంతులు. మన జాతులు గడ్డిపరకలాంటి వారమని వారి భావన. గడ్డిపరకకు విలువ ఉండదు. అదే మెలివేస్తే.. ఏనుగును కూడా బంధించవచ్చు. బీసీ, దళిత నాయకులు సహకారం తీసుకుని బ్లూప్రింట్‌ తయారు చేద్దాం. హడావుడి, ఆర్భాటం లేకుండా చాప కింద నీరులా, భూమికింద వైరింగ్‌లా ఉండాలి. ఇది రాజ్యాధికారం కోసం చేసే విప్లవం, శాశ్వత రాజ్యం కోసం. ఈ రాష్ట్రం ఎవరీ ఎస్టేటు కాదు. జాగీరు అంతకన్నా కాదు. అందరిది. వారు ఎన్ని సంవత్సరాలు అధికారం అనుభవించారో.. మనం కూడా..’’ అంటూ ముద్రగడ పద్మనాభం తన రాజకీయ పార్టీ ఆలోచనను వెల్లడించారు.

Also Read : మళ్లీ జగనే సీఎం.. లేదంటే రాజకీయ సన్యాసం.. ఉప ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు..