iDreamPost
android-app
ios-app

టీటీడీకి సుబ్రమణ్య స్వామి బాసట

  • Published Dec 30, 2019 | 1:51 AM Updated Updated Dec 30, 2019 | 1:51 AM
  • Published Dec 30, 2019 | 1:51 AMUpdated Dec 30, 2019 | 1:51 AM
టీటీడీకి సుబ్రమణ్య స్వామి బాసట

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అండగా నిలిచారు. టీటీడీపై జరుగుతున్న అన్యమత ఆరోపణలను ఆయన ఖండించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీనే ఇదంతా చేయిస్తోందని పరోక్షంగా తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి అన్నారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయాలనుకునే వారిపై పరువునష్టం దావా వేయాలి. క్రిమినల్‌ కేసులు పెట్టాలని సుబ్రమణ్యస్వామి సూచించారు.

చంద్రబాబు ప్రభుత్వ హాయంలో టీటీడీలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. వాటన్నింటిపై ‘సిట్‌’ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం టీటీడీలో సాంప్రదాయాలన్ని సక్రమంగా పాటిస్తున్నారని కితాబిచ్చారు. ఇప్పటి వరకు టీటీడీపై జరిగిన అన్యమత ప్రచారం, ఉద్యోగుల సమాచారం అంతా క్షుణ్నంగా తెలుసుకునే తాను మాట్లాడుతున్నానని పేర్కొన్నారు.

చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి గురించి పూర్తిగా తెలుసుకున్నానని, ఆయన క్రిస్టియన్‌ అని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని తేలిందన్నారు. ఆయన హిందువని తాను రూఢీ చేసుకున్నానన్నారు. రమణ దీక్షితులను మళ్లీ ప్రధాన అర్ఛకుడిగా పునర్నియమించడం సంతోషకరమన్నారు.

Jojobet GirişHoliganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetgamdom girişEscortes BelgiqueHoliganbetGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibomHoliganbet