iDreamPost
android-app
ios-app

సినీ నటి ,లోక్ సభ ఎంపీ నవనీత్‌ కౌర్‌కు కరోనా

సినీ నటి ,లోక్ సభ ఎంపీ నవనీత్‌ కౌర్‌కు కరోనా

సినీ నటి, ఎంపీ నవనీత్‌ కౌర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమె గతంలో పలు తెలుగు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. కాగా 2019 లో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు.

తాజాగా నవనీత్‌ కౌర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమె కుటుంబ సభ్యులు ముందుగా కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిని పరిరక్షించే క్రమంలో నవనీత్‌ కౌర్‌కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని నవనీత్‌ కౌర్‌ స్వయంగా వెల్లడించారు. అభిమానుల ఆశీస్సులు వల్ల కరోనాపై విజయం సాధిస్తామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. తనను కలిసిన వ్యక్తులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని నవనీత్‌ కౌర్‌ విజ్ఞప్తి చేసారు.