iDreamPost
android-app
ios-app

లెక్కల్లో సున్నా.. కుమార్తె మార్కులు చూసిన తల్లి రియాక్షన్ వైరల్..

లెక్కల్లో సున్నా.. కుమార్తె మార్కులు చూసిన తల్లి రియాక్షన్ వైరల్..

సాధారణంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధగా ఉంటారు. ముఖ్యంగా వారి చదువుల విషయంలో ఎంతో కేర్ తీసుకుంటారు. తమ బిడ్డలకు చదువులో మంచి మార్కులు వచ్చేలా  శిక్షణ ఇస్తుంటారు. ఈక్రమంలో పిల్లలకు మంచి మార్కులు వస్తే.. ఆ పేరెంట్స్ ఎంతో సంతోషిస్తారు. అలానే మార్కులు తక్కువ వస్తే.. ఒక మాదిరిగా అరుస్తారు.. అదే సున్న మార్కులు వస్తే.. ఇక తల్లిదండ్రులకు కోపం కట్టలు తెంచుకుంటుంది. అయితే తన కుమార్తెకు లెక్కలో సున్నా మార్కులు వచ్చిన విషయం తెలిసి.. ఓ తల్లి ఇచ్చిన రియాక్షన్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఆ తల్లి ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జైనాబ్ అనే యువతి చదువుకునే టైమ్ లో తనకు వచ్చిన మార్కుల షీటును తాజాగా పంచుకుంది. వాటిని సోషల్ మీడియాలో సైతం షేర్ చేసుకుంటూ..” చాలా రోజుల తరువాత రూమ్ లో నా ఆరో తరగతి లెక్కల పుస్తకం కనిపించింది. అందులో మ్యాథ్స్  లో 15 మార్కులకు గాను సున్నా వచ్చాంది. ఆ రోజు అమ్మ నన్ను మద్దలించలేదు. నా మార్కులు చూసి… స్ఫూర్తిని నింపేలా, ఆత్మవిశ్వాసం పెరిగాలే, ధైర్యంగా ఉండేలా మాట్లాడింది. డియార్ ఈ మార్కులు అంగీకరించాలంటే ధైర్యం కావాలి. నీకు చాలా ధైర్యం ఉంది” అని మార్కుల పక్కన ప్రొగ్రెస్ కార్డుపై రాసింది. అలా అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో  లెక్కల్లో మంచి మార్కులు తెచ్చుకున్నాను.

అలానే మీ పిల్లలకు తక్కువ మార్కులు వచ్చాయని కోపం తెచ్చుకోకుంటే.. కచ్చితంగా వారి నుంచి కూడ  మంచి ఫలితాలు వస్తాయని ఆమె తన జ్ఞాపకాలను పంచుకుంది.  ప్రస్తుతం  ఆమె పోస్ట్ చేసిన తన తల్లి రియాక్షన్ సోషల్ మీడియా వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఆ యువతి తల్లిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ తల్లి మాదిరిగి అందరికి సానుకూల దృక్పథం ఉంటే బాగుటుందని కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి తల్లి ఉంటే.. విద్యార్థుల ఆత్మహత్యలు జరగవని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మార్కులు తక్కువ వచ్చినప్పటికీ మీ అమ్మ ప్రోత్సాహం చాలా విలువైనది, ఆమె మనస్సు గొప్పదని మరికొందరు రాసుకొచ్చారు. మరి.. ఆ తల్లి రియాక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి