iDreamPost
iDreamPost
నిన్న విడుదలైన నాగ చైతన్య లవ్ స్టోరీ ఓపెనింగ్ సునామి తీసుకొచ్చిన కలెక్షన్లు చూసి మంచి ఖుషిలో ఉన్న అక్కినేని అభిమానులు త్వరలోనే విడుదల కానున్న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా ఇదే స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నారు. అక్టోబర్ 8 విడుదల తేదీని గతంలోనే అధికారికంగా ప్రకటించారు. అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇది మరోసారి వాయిదా పడొచ్చని ఫిలిం నగర్ టాక్. అదే నెల 15కి పోస్ట్ పోన్ చేయొచ్చని అంటున్నారు. ప్రస్తుతానికి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు కానీ అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు బాలన్స్ ఉన్నందుకు ఈ నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు.
గీతా ఆర్ట్స్ 2 నుంచి కన్ఫర్మేషన్ వచ్చే దాకా చెప్పలేం కానీ ప్రస్తుతానికి డిస్ట్రిబ్యూటర్లకు 8వ తేదీకి సంబంధించి వైష్ణవ్ తేజ్ కొండపొలం మాత్రమే ఖరారైనట్టుగా చెబుతున్నారు. దాంతో పోటీ వల్ల బ్యాచిలర్ డ్రాప్ అవుతాడని చెప్పడానికి లేదు. ఎందుకంటే రెండు సంబంధం లేని డిఫరెంట్ జానర్లు. టార్గెట్ చేసుకున్న ఆడియన్స్ కూడా వేరే. ఆలోగా లవ్ స్టోరీ, రిపబ్లిక్ ఎలాగూ నెమ్మదించి ఉంటాయి కాబట్టి రెండు సినిమాలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే మాత్రం దానికి సాంకేతిక పరమైన కారణాలే ఉండొచ్చు.
ఇదంతా ఓకే కానీ ఎప్పుడో జనవరికే రిలీజ్ ఫిక్స్ అనుకున్న ఈ సినిమా ఇన్ని నెలల తర్వాత మరోసారి డేట్ కి కట్టుబడకపోవడం అంటే అభిమానుల్లో లేనిపోని అనుమానాలు రేపినట్టవుతుంది. ఇప్పటికి ఇంకా ప్రమోషన్లు కూడా మొదలుపెట్టలేదు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ దీని మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇటీవలే రిలీజ్ చేసిన లెహరియా పాట యూత్ లోకి బాగా వెళ్ళింది. సంగీత దర్శకుడు గోపి సుందర్ తనదైన శైలిలో మేజిక్ చేశారు. ఐదేళ్లు దాటుతున్నా ఇంకా సక్సెస్ టేస్ట్ చేయని అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ కు మోస్ట్ ఎలిజిబుల్ మినిమమ్ హిట్ కావడం చాల అవసరం
Also Read : ఒక్క పాట – జీవితాలను మార్చేస్తోంది