Idream media
Idream media
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కేశుబాయ్ పటేల్ ఆరోగ్యం మందగిస్తుండటం, నాడు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కి ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో పార్టీ బలహీనపడుతున్నట్లు అధిష్ఠానం గుర్తించింది. ఆ పరిస్థితిలో పటేల్ స్థానంలో నరేంద్ర మోదీకి బాధ్యతలు అప్పగించాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. దాంతో గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001 అక్టోబరు 7న నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 7 నాటికి మోదీ ప్రజా సేవకు అంకితమైన ఇరవై ఏళ్లు కానుంది. ఈ నేపథ్యంలో బీజేపీ రెండు దశాబ్ధాల మోదీ ప్రజా సేవను ఘనంగా సంబరాలు జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది.
2001, 2002, 2007, 2012 మొత్తం నాలుగు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ పని చేశారు. ఆ తర్వాత 2014లో అసెంబ్లీకి రాజీనామా చేసి.. లోక్ సభకు ఎన్నికయ్యారు. 26 మే 2014న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇరవై యేళ్లుగా నిరంతర ప్రజాసేవ చేస్తున్న సందర్భంగా వేడుకలను జరుపుకోవడానికి సిద్ధం అవుతోంది.
Also Read : లఖీంపూర్ ఘటన తర్వాత ఏం జరుగుతోంది..?
ఇందులో భాగంగా అక్టోబర్ 7న భారతీయ పార్టీ తరుఫున పెద్ద కార్యక్రమాలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. పార్టీ కార్యకర్తలు నదులను శుభ్రపరచడం, ఇతర సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించింది. అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. ప్రతి బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలు ప్రజలకు మోడీ విధానాల గురించి అవగాహన కల్పిస్తారని బిజెపి వర్గాలు వెల్లడించాయి.
అక్టోబర్ 7న స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా దేశంలోని నదులను శుభ్రం చేయడం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ బృహత్తర కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలు.. తమతమ నియోజకవర్గాలలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే, “దేశవ్యాప్తంగా గురుద్వారాలు ప్రధాని మోడీ దీర్ఘాయుష్షు కోసం ‘అర్దాస్’ నిర్వహిస్తారు. ‘సేవ సమర్పణ’లో భాగంగా లాంగర్ నిర్వహించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 71 వ జయంతిని పురస్కరించుకుని దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అనేక సిక్కు కమిటీలు ఈ ఉత్సవాలను ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Also Read : రైతుల పై దూసుకెళ్లిన కేంద్ర మంత్రి కుమారుడి కారు , 8 మంది మృతి