iDreamPost
android-app
ios-app

కరోనాతో వైసీపీ నేత చల్లా కన్నుమూత

కరోనాతో వైసీపీ నేత చల్లా కన్నుమూత

కరోనా మహమ్మారి ఏపీలో మరో ప్రజా ప్రతినిధిని బలితీసుకుంది. వైసీపీ నేత, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి ఈ రోజు మరణించారు. కరోనా సోకడంతో ఆయన కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో 72 ఏళ్ల రామకృష్ణా రెడ్డి తుది శ్వాస విడిచారు.

1948 ఆగస్టు 27న జన్మించిన చల్లా రామకృష్ణారెడ్డి పాణ్యం, కోయిలకుంట్ల (ప్రస్తుతం బనగానపల్లి) ఎమ్మెల్యేగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా సేవలందిస్తున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీలో ఆయన పని చేశారు. గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. పాణ్యంలో వైసీపీ గెలుపునకు కృషి చేశారు.

కాగా, అదే నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నాయకుడు యర్రబోతుల వెంకటరెడ్డి కూడా ఇటీవల కరోనాతో మృతి చెందారు. ఒకే నియోజకవర్గాని చెందిన ఇద్దరు సీనియర్‌ నాయకులు కరోనాతో మృతి చెందడం ఆ నియోజకవర్గ ప్రజల్లో శోకాన్ని నింపింది.